గంజాయి యువతను నిర్వీర్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజూ గంజాయి పట్టుబడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. స్మగ్లర్స్ బరి తెగించి మత్తు పదార్థాలను హోమ్ డెలివరీ చేయడం ఆందోళన కలిగిస్తుంది.
గిరిజనుల కష్టంతో రెండు చేతుల కోట్లాది రూపాయల ను కూడగడుతున్న అంతరాష్ట్ర స్మగ్లర్లు.. కాస్త తేడా వచ్చినా, ఎదురు తిరిగినా నిర్బంధాలు చేస్తున్నారు. తమ క్రూరత్వాన్ని బయటపెట్టి..
ఈ మధ్య కాలంలో వచ్చిన పుష్ప సినిమాలో.. సరికొత్త పద్ధతుల్లో ఎర్రచందనం ఎలా సరఫరా చేయాలో చూపించారు. అంతకుమించిన రేంజ్లో ఇప్పుడు స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.
ORRపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. అయితే అనూహ్యంగా కారులోని వారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
గంజాయి స్మగ్లింగ్ చేసే మెయిన్ వ్యక్తులు దొరకడం లేదు. మధ్యలో డబ్బులకు ఆశపడి రవాణా చేసే వ్యక్తులను అసలైన స్మగ్లర్స్ పావులుగా వాడుకుంటున్నారు. కొందరు పేద కుర్రాళ్లు డబ్బు కోసం ఈ పని చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.
తాటికాయంత అక్షరాలతో అవగాహన కల్పించినా..గంజాయి జోలికి వెళ్తే కఠిన శిక్షలు తప్పవని చెవిలో జోరిగాలా హెచ్చరించినా దందాకు మాత్రం కళ్లెంపడ్డంలేదు. ఉక్కుపాదం మాటేమో గానీ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి తెగులు పరిపరి విధములు విస్తరిస్తూనే ఉంది.