Breaking : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి ప్రధాన అనుచరుడు సాబినేని రాంబాబుపై కాపుకాచి దాడి.. అపస్మారకస్థితిలో బాధితుడు
Sabineni Rambabu : ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ప్రధాన అనుచరుడు సాబినేని రాంబాబు పై కాపు కాచి దుండగులు దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన రాంబాబు అపస్మారక..
Sabineni Rambabu : ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ప్రధాన అనుచరుడు సాబినేని రాంబాబు పై కాపు కాచి దుండగులు దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన రాంబాబు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. బాధితుడ్ని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకొన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు. పాత కక్షల నేపథ్యంలో పక్కా ప్రణాళిక ప్రకారం సాబినేనిపై దాడి చేసినట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.