Chicken prices : బర్డ్ ఫ్లూ పుణ్యమాని తగ్గిన కోళ్ల లభ్యత, చుక్కలనంటుతోన్న చికెన్ ధరలు
Chicken prices : చికెన్ ధర మళ్ళీ పరుగులు తీస్తోంది. కొన్నాళ్ల క్రితం బర్డ్ ఫ్లూ ప్రచారంతో పడిపోయిన చికెన్ ధరలు మళ్ళీ ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించేశారు..
Chicken prices : చికెన్ ధర మళ్ళీ పరుగులు తీస్తోంది. కొన్నాళ్ల క్రితం బర్డ్ ఫ్లూ ప్రచారంతో పడిపోయిన చికెన్ ధరలు మళ్ళీ ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించేశారు దీంతో ప్రస్తుతం కోళ్ల లభ్యత తగ్గింది. దీనికి తోడు, ప్రస్తుతం చికెన్ కి డిమాండ్ పెరగడంతో కిలో చికెన్ ధర 240 దాటి మాంసప్రియులకు చుక్కలు చూపిస్తోంది. ఇలాఉండగా, గత రెండేళ్ల కాలంలో ఫౌల్ట్రీ రైతులు మాత్రం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరోనా ఉపద్రవంతో తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. దీనికి తోడు చికెన్ తినొద్దంటూ వస్తున్న పుకార్లు కూడా ఈ రంగాన్ని పదే పదే కుదేలయ్యేలా చేస్తోంది.