AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సండే స్పెషల్.. పుదీనా చికెన్ బజ్జీలు.. కాంబినేషన్ అదిరిపోలా.. ఎలా చేయాలో తెలుసా !

చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా ఆదివారం వస్తే చికెన్ షాపుల ముందు బారులు తీరుతారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా చికెన్ తినడానికి ఇష్టపడుతుంటారు. చికెన్‌తో కూరలు,

సండే స్పెషల్.. పుదీనా చికెన్ బజ్జీలు.. కాంబినేషన్ అదిరిపోలా.. ఎలా చేయాలో తెలుసా !
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2021 | 9:51 PM

Share

చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా ఆదివారం వస్తే చికెన్ షాపుల ముందు బారులు తీరుతారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా చికెన్ తినడానికి ఇష్టపడుతుంటారు. చికెన్‌తో కూరలు, బిర్యానీలే కాదు బజ్జీలు కూడా తయారుచేసుకోవచ్చు. శరీరానికి చలువనిచ్చి… ఆరోగ్య ప్రదాయినిగా ఉపయోగపడే… పుదీనాతో చికెన్ వంటకం ఎంత రుచిగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఆదివారపు సాయంత్రానా పుదీనా చికెన్ బజ్జీలతో గడిపేయండి. మరీ ఎలా చేయాలో తెలుసుకుందామా.

కావల్సిన పదార్థాలు..

* చికెన్- అరకిలో * పుదీనా- 2 కప్పులు * కొత్తిమీర- కప్పు * అల్లం ముక్క- కొద్దిగా * వెల్లుల్లి- రెబ్బలు * పచ్చిమిర్చి- 5 * పెరుగు – అరకప్పు * గరం మసాలా- టీ స్పూను * పసుపు- అర స్పూను * ఉప్పు – రుచికి తగినంత * నూనె – అర కప్పు * నిమ్మకాయలు 1 * జీడిపప్పు అవసరమైనన్నీ.

తయారీ విధానం..

ముందుగా కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి మిక్సి పట్టి పేస్టులా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి చికెన్ కలిపి దాంతోపాటు తగినంత ఉప్పు, పసుపు, పెరుగు, గరంమాసాల కలిపి గంటసేపు ఫ్రీజ్ లో పెట్టుకోవాలి. అనంతరం ఒక బాణాలి తీసుకోని అందులో కాస్తా నూనే వేసి వేడి చేసుకోవాలి. అందులో జీడిపప్పులు వేయించాలి. అందులోనే చికేన్ ముక్కులు కూడా వేయాలి. చికెన్ అన్ని వైపులా చక్కగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అందులోనే నిమ్మరసం, కొత్తిమీర వేసి మరికాసేపు వేయించాలి. అంతే ఎంతో రుచికరంగా కరకరలాడే పుదీనా చికెన్ రెడి అయిపోతుంది.

Also Read:

నోరూరించే చింతకాయ నువ్వుల పచ్చడి.. టెస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు… ఎలా చేసుకోవాలంటే..

జుట్టు రాలిపోవడంతో బాధపడుతున్నారా ? అయితే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. రిజల్ట్ పక్కా..

బరువు తగ్గాడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ప్రయోజనాలెన్నో…

డిప్రెషన్‏కు గురవుతున్నారా ?.. అయితే మీరు డేంజర్‏లో ఉన్నట్టే.. అధ్యాయనాల్లో బయటపడ్డ విషయాలు..

International Women’s Day 2021: అందమైన అతివలకు… అదిరిపోయే డ్రెస్సింగ్ ఐడియాస్.. ఉమెన్స్‌ డే సందర్బంగా ఓ లుక్కేయండి!