AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే చింతకాయ నువ్వుల పచ్చడి.. టెస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు… ఎలా చేసుకోవాలంటే..

చింతకాయలోని పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధుల

నోరూరించే చింతకాయ నువ్వుల పచ్చడి.. టెస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు... ఎలా చేసుకోవాలంటే..
Rajitha Chanti
|

Updated on: Mar 05, 2021 | 10:01 PM

Share

చింతకాయలోని పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. విత్తనాల సారం రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే చింతపండు పులుసు శరీర బరువు తగ్గడానికి, కొవ్వు కాలేయ వ్యాధిని రివర్స్ చేయడానికి సహాయపడుతుంది. ఇవే కాకుండా చింతకాయతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో చింతకాయ నువ్వుల పచ్చడి ఒకటి. మరీ అది ఎలా చేయాలో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు..

చింతకాయలు – 10 వేయించిన నువ్వులు – 100 గ్రాములు పచ్చి మిర్చి – 10 ఉప్పు – తగినంత మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను ఆవాలు – ఒక టీ స్పూను జీలకర్ర – ఒక టీ స్పూను మెంతులు – పావు టీ స్పూను పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను నూనె – 2 టేబుల్‌ స్పూన్లు పసుపు – తగినంత

తయారీ విధానం…

ముందుగా చింతకాయను శుభ్రంగా కడిగి.. తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా చేసి.. గుజ్జును వడకట్టుకోవాలి. ఇక స్టౌమీద మరో బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణాలిలో మరింత నూనె వేసి కాగాక.. సెనగ ప్పపు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి పక్కనపెట్టుకోవాలి. ఇవన్ని చల్లారక మిక్సీలో వేసి పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు జతచేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత వెయించిన నువ్వులను కూడా కలిపి మరోసారి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. చివరగా చింతకాయ గుజ్జును కలిపి మరోసారి మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇక దీనిని పోపు పెట్టేస్తే సరి.

Also Read:

బరువు తగ్గాడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ప్రయోజనాలెన్నో…

డిప్రెషన్‏కు గురవుతున్నారా ?.. అయితే మీరు డేంజర్‏లో ఉన్నట్టే.. అధ్యాయనాల్లో బయటపడ్డ విషయాలు..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత