AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదా? .. దానికి కోటింగ్ వేసి..

చెర్రీలా కనిపిస్తున్న కొన్ని పండ్లపై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాక్కాయను ప్రాసెస్ చేసి, ఎరుపు రంగు, కోటింగ్ వేసి చెర్రీలా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ల్యాబ్ పరీక్షలు లేకుండా ఇవి నకిలీ చెర్రీలని నిర్ధారించలేం. అనుమానాస్పద పండ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.

చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదా? .. దానికి కోటింగ్ వేసి..
Fake Cherry
M Sivakumar
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 5:35 PM

Share

చూడటానికి అచ్చం చెర్రీ పండులానే ఉంది. ఎర్రగా.. మెరుస్తూ.. చూడగానే కొనాలనిపించేలా ఆకట్టుకుంటోంది. కానీ కోసి చూస్తే మాత్రం అసలు విషయం బయటపడుతుందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ పేరుతో వాక్కాయను ఉడకబెట్టి, దానికి ఎరుపు రంగు, కోటింగ్ వేసి చెర్రీలా తయారు చేసి అమ్ముతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో కనిపించే చెర్రీ నిజమైనదేనా? లేక ఇలా ప్రాసెస్ చేసిన వాక్కాయనా? అనే సందేహం వినియోగదారుల్లో మొదలైంది.

సాధారణంగా చెర్రీ చిన్నగా, ఎర్రటి రంగులో, మెరిసేలా ఉంటుంది. ఇదే లుక్‌ను పోలి ఉండేలా వాక్కాయను ప్రాసెస్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాక్కాయను ఉడకబెట్టి.. ఆ తర్వాత ఎరుపు రంగు లేదా కోటింగ్ వేసి.. చెర్రీ మాదిరిగా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బయటకు చూస్తే అసలు చెర్రీకి, ఇలా తయారు చేసిన పండుకు తేడా గుర్తించడం కష్టమని కొందరు వినియోగదారులు అంటున్నారు.

అసలు ట్విస్ట్ ఇక్కడే.. అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్‌గా తెలుసుకోవాలి. వాక్కాయతో తయారు చేశారనే కారణంతోనే అది ప్రమాదకరమని చెప్పలేం. అసలు సమస్య.. దానికి ఏ రంగు వేశారు? ఏ కోటింగ్ ఉపయోగించారు? అవి ఫుడ్‌లో వాడేందుకు అనుమతించబడినవేనా? నిర్ణీత పరిమితుల్లోనే ఉన్నాయా? అన్నదే. అనుమతిలేని రంగులు లేదా ఇతర పదార్థాలు ఉపయోగించినట్లు తేలితే మాత్రం అది సీరియస్ ఫుడ్ సేఫ్టీ ఇష్యూ అవుతుంది.

అందుకే సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు, ఫొటోలు చూసి వెంటనే ‘ఇవి నకిలీ చెర్రీలు’ అని ఫిక్స్ అవ్వడం కరెక్ట్ కాదు. మార్కెట్ నుంచి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌లో పరీక్షిస్తేనే అసలు నిజం బయటపడుతుంది.

మార్కెట్‌లో చెర్రీలు కొనేటప్పుడు.. అసహజంగా ఒకే రకమైన ఎరుపు రంగు ఉందా? మామూలు కంటే ఎక్కువగా మెరుస్తుందా? చేతికి రంగు అంటుతోందా? పండు సహజంగా కాకుండా కృత్రిమంగా కనిపిస్తుందా? ఇలాంటి విషయాలు గమనించండి. అనుమానం వస్తే రుచి చూసి టెస్ట్ చేయకండి. అనుమానాస్పదంగా అనిపిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడం మంచిది.

అధికారులు ఏం చేయాలి?

చెర్రీ పేరుతో వాక్కాయను ప్రాసెస్ చేసి అమ్ముతున్నారనే ఆరోపణలు నిజమైతే అధికారులు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించాలి. అనుమానాస్పద పండ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపాలి. అప్పుడే అవి నిజమైన చెర్రీలా? వాక్కాయతో తయారు చేసినవా? ఏ రంగులు, కోటింగ్స్ వాడారు? అవి ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనే ప్రశ్నలకు క్లారిటీ వస్తుంది. చూడటానికి చెర్రీలా ఉందని వెంటనే కొనేయకండి.. మన ప్లేట్‌లోకి వెళ్తున్నది ఏంటో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

Follow Us