Woman Cheated: హౌసింగ్, ఎస్సీ కార్పోరేషన్ రుణాల పేరుతో ఓ మహిళ మోసం.. పోలీసులకు ఫిర్యాదు
Woman Cheated: హౌసింగ్, ఎస్సీ కార్పోరేషన్ రుణాల పేరుతో బిందు అనే మహిళ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు సంవత్సరాల..
Woman Cheated: హౌసింగ్, ఎస్సీ కార్పోరేషన్ రుణాల పేరుతో బిందు అనే మహిళ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు సంవత్సరాల కిందట నాగమణి, కృష్ణకుమారి అనే మహిళల పేరుతో బొంగరాల బీడుకు చెందిన బిందు అనే మహిళ ఎస్సీ కార్పోరేషన్, హౌసింగ్ రుణాలు తీసుకుంటోంది. ఇద్దరి మహిళల పేరుతో పది లక్షల రూపాయలకుపైగానే రుణాలు తీసుకుంటున్నట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశీల, కుమారి అనే మహిళలతో కలిసి మోసాలకు పాల్పుడుతున్నట్లు తెలుస్తోంది. జగనన్న హౌసింగ్ స్కీమ్‌కు బాధిత మహిళలు దరఖాస్తు చేసుకోవడంతో ఈ వ్యవహారం బయట పడింది.
తమ పేరుతో రుణాలు తీసుకుని మోసం చేయడంతో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు అనర్హులయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రుణాలు ఎందుకు తీసుకున్నారని అడిగితే దాడులకు పాల్పడుతున్నారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరుతున్నారు.