ప్రధాని మోదీ హయంలో జాతీయ రహదారులకు మహార్ధశ.. రాజ్యసభలో వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Feb 08, 2021 | 1:32 PM

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పూర్తి చేశామన్నా ఆయన.. త్వరలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పూర్తి చేస్తామన్నారు.

ప్రధాని మోదీ హయంలో జాతీయ రహదారులకు మహార్ధశ.. రాజ్యసభలో వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ
Follow us

AP Telangana National Highways : దేశంలోని పలు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పూర్తి చేశామన్న ఆయన.. త్వరలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పూర్తి చేస్తామన్నారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గడ్కరీ సమాధానం ఇచ్చారు.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారులు అభివ‌ృద్ధి కోసం ఏపీలో 62 ప్రాజెక్టులు, తెలంగాణలో 23 ప్రాజెక్టులు అభివృద్ధి చేశామన్నారు. 2014 నాటికి దేశంలో జాతీయ రహదారుల విస్తీర్ణం 91,287 కి.మీ ఉంటే, ప్రస్తుతం 1,36,251 కి.మీ మేర పెరిగిందన్నారు. 2014 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల విస్తీర్ణం 6,590కి.మీ మాత్రమే అన్నారు. ప్రస్తుతం ఏపీలో 7,340కి.మీ చేరుకుందన్న మంత్రి… ఏపీలో 2,667 కి.మీ పెరిగినట్టుగా నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 3,974 కి.మీటర్ల మేర జాతీయ రహదారులను అభివృద్ధి చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 తర్వాత 42 జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి చేశామన్న మంత్రి గడ్కరీ, మరో 63 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇటు, తెలంగాణలో 2014 తర్వాత 40 హైవే ప్రాజెక్టులు పూర్తికాగా, 32 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

Read Also… Farm Laws: కనీస మద్దతు ధర ఎప్పుడూ ఉంటుంది.. రైతులు ఉద్యమాన్ని వీడి చర్చకు రావాలి: ప్రధాని మోదీ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu