AP Political: జనసేన సీట్లపై చంద్రబాబు స్పష్టత.. ఆశావహులకు కీలక హామీలు
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు ఎన్నికల కోసం అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఒకవైపు టీడీపీ -జనసేన పొత్తులో ఉండగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసొచ్చే అవకాశాలు ఉన్నట్లు రెండు పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు ఎన్నికల కోసం అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఒకవైపు టీడీపీ -జనసేన పొత్తులో ఉండగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసొచ్చే అవకాశాలు ఉన్నట్లు రెండు పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుల విషయంలో స్పష్టత కోసం ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఇక టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.. దానికి తగ్గట్టుగానే ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై రెండు పార్టీలు అధినేతలు అనేకమార్లు సమావేశమై కసరత్తు పూర్తి చేశారు. మొదటి విడత అభ్యర్థుల ప్రకటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ స్థానాలకు, జనసేన పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
మొత్తం 99 స్థానాలకు రెండు పార్టీలు అధినేతలు సీట్ల ప్రకటన చేశారు. అయితే మొదటి విడతలు జనసేన కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మిగిలిన 19 స్థానాలు ఎక్కడెక్కడ అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొన్ని స్థానాలపై స్పష్టత వస్తున్నప్పటికీ స్థానికంగా టీడీపీ – జనసేన నాయకుల మధ్య ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు పార్టీలు అధినేతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట విడత అభ్యర్థుల ప్రకటన తర్వాత కొన్ని స్థానాల్లో టిడిపి జనసేన అభ్యర్థుల మధ్య గందరగోళం నెలకొంది. మరికొన్ని స్థానాల్లో సీనియర్లకు టిడిపి సీట్లు దక్కలేదు. దీంతో గందరగోళం నెలకొన్న స్థానాలతో పాటుగా సీట్లు దక్కని సీనియర్ నేతలను చంద్రబాబు పిలిపించి సర్ది చెప్పి పంపించారు. అధికారంలోకి రాగానే కచ్చితంగా న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చి పంపించేశారు అయితే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుందని స్థానాలపై కూడా చంద్రబాబు టిడిపి నేతలకు స్పష్టత తీస్తూ వస్తున్నారు. మరోవైపు టిడిపిలోనే సీట్ల కేటాయించిన స్థానాల్లో ఉన్న ఇతర ఆశావాహులకు సైతం చంద్రబాబు స్వయంగా మాట్లాడి సర్ది చెబుతున్నారు దాంట్లో భాగంగా మరొక 12 అసెంబ్లీ స్థానాల టిడిపి ఇన్ చార్జిలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు..ఆయా స్థానాలను జనసేనకు కేటాయించినట్లు పరోక్షంగా వారికి స్పష్టం చేశారు..అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయాలంటూ కూడా చంద్రబాబు సూచించారు.
టిడిపి జనసేన మొదటి విడత ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత జనసేన పోటీ చేసే స్థానాలపై ఒక్కొక్కటిగా చంద్రబాబు స్పష్టత ఇస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగా ఒకేరోజు 12 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఇంచార్జి ల చంద్రబాబు ఫోన్లో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ 12 స్థానాలను జనసేనకు కేటాయిస్తున్నట్లు పరోక్షంగా స్పష్టం చేశారు. మరొక ఏడు టీడీపీ స్థానాల ఆశావహులతోనూ మాట్లాడారు..విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలను, తీసుకునే నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకుని కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని నేతలకు సూచించారు.
