Chandrababu Custody: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు వాయిదా

|

Sep 12, 2023 | 8:38 PM

చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే కస్టడీ అవసరం ఏంటో చెబుతూ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ పిటిషన్‌ వాదనలు రేపటి వాయిదా వేస్తూ కోర్టు వెల్లడించిది. కౌంటర్‌ పిటిషన్‌ను రేపు దాఖలు చేస్తామన్న చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. అయితే రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందని..

Chandrababu Custody: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు వాయిదా
Chandrababu
Follow us on

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభ కోణంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ సంచలనం సృష్టించింది. చంద్రబాబుకు రిమాండ్‌ విధించి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. అయితే చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే కస్టడీ అవసరం ఏంటో చెబుతూ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ పిటిషన్‌ వాదనలు రేపటి వాయిదా వేస్తూ కోర్టు వెల్లడించిది. కౌంటర్‌ పిటిషన్‌ను రేపు దాఖలు చేస్తామన్న చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. అయితే రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందని, వెంటనే చంద్రబాబు నాయుడును హౌస్ రిమాండ్‌ విధించాలని చంద్రబాబు తరపున న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేయగా, సా.4.30 గంటలకు తీర్పు వెలవడనుంది.

అలాగే తనపై కేసును కొట్టేయాలని హైకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సరైన సాక్ష్యాలు లేకుండానే సీఐడీ కేసు నమోదు చేసిందన్న చంద్రబాబు ఆరోపించారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 482 కింద పిటిషన్‌ దాఖలు చేశారు. 20 పేజీలతో క్రిమినల్‌ పిటిషన్‌ మెమోరాండం దాఖలు, రిమాండ్‌ ఆదేశాలను కూడా సస్పెండ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే తదుపరి చర్యలపై స్టే విధించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ అని, తనపై ఎటువంటి నిర్ధిష్ట ఆరోపణలు లేవని చంద్రబాబు అన్నారు. రిమాండ్‌, స్పెషల్‌ కోర్టు చర్యలు చెల్లవని క్వాష్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు చంద్రబాబు. రిమాండ్‌ రిపోర్టులో చెప్పిన విషయాలన్నీ అసంబద్ధమని చంద్రబాబు వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి