Chandrababu Cabinet 4.0: ఏపీలో ప్రమాణం చేసిన మంత్రులు వీరే.. ఏయే వర్గాల వారికి ఎన్ని పదవులు దక్కాయంటే..

ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ అహ్మద్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. కేసరపల్లి IT పార్క్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే నేతలు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Chandrababu Cabinet 4.0: ఏపీలో ప్రమాణం చేసిన మంత్రులు వీరే.. ఏయే వర్గాల వారికి ఎన్ని పదవులు దక్కాయంటే..
Andhra Pradesh CM Oath Ceremony

Updated on: Jun 12, 2024 | 1:56 PM

ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నజీర్ అహ్మద్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. కేసరపల్లి IT పార్క్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే నేతలు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మొదట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ మంత్రులతో ప్రమాణం చేయించారు. మొదట జనసేన అధినేత పవన్ కల్యాణ్, అనంతరం నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణం చేసిన మంత్రులు వీరే..

  1. పవన్ కల్యాణ్
  2. నారా లోకేష్
  3. కింజారపు అచ్చెన్నాయుడు
  4. కొల్లు రవీంద్ర
  5. నాదేండ్ల మనోహర్
  6. పొంగురు నారాయణ
  7. వంగలపూడి అనిత
  8. సత్యకుమార్ యాదవ్
  9. నిమ్మల రామానాయుడు
  10. మహ్మద్ ఫరూక్
  11. ఆనం రామనారాయణ రెడ్డి
  12. పయ్యావుల కేశవ్
  13. అనగాని సత్యప్రసాద్
  14. కొలుసు పార్థసారిధి
  15. బాలవీరాంజనేయస్వామి
  16. గొట్టిపాటి రవికుమార్
  17. కందుల దుర్గేష్
  18. గుమ్మడి సంధ్యారాణి
  19. బీసీ జానార్థన్ రెడ్డి
  20. టీజీ భరత్
  21. ఎస్. సవిత
  22. వాసంశెట్టి సుభాష్
  23. కొండపల్లి శ్రీనివాస్
  24. మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి

చంద్రబాబు 4.0 కేబినెట్.. మొత్తం 25 మంది.. సామాజిక అంశాల ప్రకారం.. 

సీఎంతో కలిపి కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉండనున్నారు. చంద్రబాబు కాకుండా 12 మంది ఓసీలకు మంత్రి పదవులు దక్కాయి.

ఓసీల్లో కాపు-4, కమ్మ -4, రెడ్డి -3, వైశ్య- 1 చొప్పున మంత్రి పదవులను కేటాయించారు.

బీసీ- 8, ఎస్సీ- 2, ఎస్టీ-1, మైనారిటీ -1 చొప్పున మంత్రి పదవులు దక్కాయి.

కేబినెట్‌లో ముగ్గురు మహిళలకు అవకాశం లభించింది.

గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రి పదవులు దక్కాయి. చిత్తూరు నుంచి సీఎంగా చంద్రబాబు.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, విజయనగరం నుంచి.. ఇద్దరేసి చొప్పున కేబినెట్‌లో అవకాశం లభించింది. కడప, విశాఖ, శ్రీకాకుళం నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి దక్కింది..