AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: ఏపీలోని మహిళలందరికీ గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. అదిరిపోయేలా సంక్రాంతి కానుక..

ఏపీలోని మహిళలందరికీ సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. త్వరలో ఇంటి నుంచే రుణం పొందే సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. దీని ద్వారా మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

CM Chandrababu: ఏపీలోని మహిళలందరికీ గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. అదిరిపోయేలా సంక్రాంతి కానుక..
Cm Chandrababu
Venkatrao Lella
|

Updated on: Jan 10, 2026 | 12:44 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొదుపు సంఘాల సభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. సంక్రాంతి సందర్భంగా మహిళా డ్వాక్రా సంఘాలకు గుడ్‌న్యూస్ తెలిపారు. ఇక నుంచి పొదుపు సంఘాలకు ఆన్‌లైన్‌లోనే రుణాలు అందించనున్నారు. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఇందుకు తగిన ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ సిద్దం చేస్తున్నామని, ఇక నుంచి మహిళా సంఘాలు సులువుగా లోన్ తీసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం మహిళలకు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ సమర్పించి లోన్ తీసుకోవాలంటే చాలా ఆలస్యమవుతోంది.

ఇంటి వద్ద నుంచే రుణ సదుపాయం

కానీ త్వరలో డ్రాక్వా మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన సమస్య ఉండదు. ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వం రుణ సదుపాయం అందించనుంది. ప్రభుత్వం స్త్రీ నిధి, ఉన్నతి వంటి పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తోంది. ఇక నుంచి ఈ పథకాల ద్వారా రుణాలను ఆన్‌లైన్ ద్వారానే పొందవచ్చు. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించడంతో పాటు మన డబ్బులు -మన లెక్కలు అనే యాప్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మహిళలు తమ సంఘానికి సంబంధించిన లెక్కలు చూసుకోవచ్చు. తాము తీసుకున్న లోన్ వివరాలతో పాటు పాటు ఇప్పటివరకు చెల్లించిన లావాదేవీలు, చెల్లించాల్సినవి అన్నీ చూసుకోవచ్చు.

ఏపీలో 1.13 కోట్ల పొదుపు సంఘాలు

ఇక వడ్డీ వివరాలను కూడా మొబైల్‌ ద్వారా యాప్ సాయంతో డ్వాక్రా సంఘాల్లోని ప్రతీ మహిళ చెక్ చేసుకోవచ్చు. లోన్ లెక్కలు తెలుసుకోవడానికి బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన పని దీని వల్ల తప్పుతుంది. ఇక త్వరలో తీసుకురానున్న ఫ్లాట్‌ఫామ్ వల్ల రుణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో 1.13 కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల్లో ఉన్నారని, వీరి ద్వారా ఇప్పటివరకు రూ.26 వేల కోట్ల నిధులు సమీకరించబడినట్లు తెలిపారు. ఈ విజయానికి మహిళలను సీఎం చంద్రబాబు అభినందించారు. ఇక కొత్త డ్వాక్రా గ్రూపులకు రివాల్వింగ్ ఫండ్ కింద ఇటీవల ప్రభుత్వం ఒక్కో గ్రూపు అకౌంట్లో రూ.15 వేల చొప్పున జమ చేసింది. వీటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోదు. మహిళల అకౌంట్లో డబ్బులు ఉండటం వల్ల త్వరగా రుణాలు వస్తాయని, అందులో భాగంగానే వీటిని జమ చేసినట్లు పేర్కొంది.