చంద్రప్రభ వాహనంపై.. ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు
కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తిరుచానూర్ పద్మావతి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు
Tiruchanur Padmavati Ammavaru: కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తిరుచానూర్ పద్మావతి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ సమీపంలోని వాహన మండపంలో మంగళవారం రాత్రి అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. వాహనసేవలో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఈవో జవహర్‌రెడ్డి దంపతులు, జేఈవో పి.బసంతకుమార్ దంపతులు, ఆగమ సలహాదారు శ్రీనివాసచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక గురువారం అమ్మవారికి పంచమీ తీర్థం(చక్రస్నానం) నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.