AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert: మగాళ్లు ఇది తెలుసుకోండి.. భార్యకు ఇష్టంలేని సెక్స్.. భర్తపై రేప్ కేసు తధ్యం..!

భార్యకు ఇష్టం లేకుండా లైంగిక చర్యకు పాల్పడిన భర్తపై మారిటల్ రేప్ కేసులు నమోదు చేసే విషయంలో సుప్రీంకోర్టు సూచనల ప్రకారం కేంద్ర హోంశాఖ వివిధ సమూహాల నుంచి అభిప్రాయ సేకరణ కోరింది. వివాహ వ్యవస్థపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చర్చించాలని కోరింది.

Alert: మగాళ్లు ఇది తెలుసుకోండి.. భార్యకు ఇష్టంలేని సెక్స్.. భర్తపై రేప్ కేసు తధ్యం..!
Supreme Court
M Sivakumar
| Edited By: |

Updated on: Nov 20, 2023 | 5:34 PM

Share

భార్యకు ఇష్టం లేకుండా లైంగిక చర్యకు పాల్పడిన భర్తపై మారిటల్ రేప్ కేసులు నమోదు చేసే విషయంలో సుప్రీంకోర్టు సూచనల ప్రకారం కేంద్ర హోంశాఖ వివిధ సమూహాల నుంచి అభిప్రాయ సేకరణ కోరింది. వివాహ వ్యవస్థపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చర్చించాలని కోరింది. ఈ అంశంపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా లేఖ అందుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం సమగ్రంగా చర్చించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన ఈ అంశంపై ప్రత్యేక కమిటీ చర్చ జరిపింది. మారిటల్ రేప్ కేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో జరుగుతున్న పరిణామాలను లీగల్ కౌన్సిలర్ పూజిత యాదవ్ వివరించారు. కమిషన్ సెక్షన్ ఆఫీసర్లు శ్రీమతి ఎస్.వి.ఎస్ శైలజ, శ్రీమతి బి సంధ్య కేంద్ర హోంశాఖ పంపిన నోట్ వివరాలను వెల్లడించారు. సోషల్ వర్కర్ శ్రీమతి జి.దేవి వివాహ వ్యవస్థలో మహిళలపై సెక్సువల్ దాడులను పేర్కొన్నారు.

ఈ సమావేశాన్ని ప్రారంభిస్తూ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ.. ‘మహిళల భద్రత కోసం చేస్తున్న చట్టాలు సద్వినియోగం కాకపోవటం వల్ల దుర్వినియోగం అవుతున్నాయని దీనిని సాకుగా చూపి కొత్త చట్టాలు చేయటానికి ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి’ అని అన్నారు. స్త్రీలకు తమ శరీరంపై వారికి హక్కు ఉందని, ఇష్టం లేకుండా భర్త అయినా లైంగిక చర్య చేస్తే రేప్ కేసులు నమోదు చేయటం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు. స్త్రీల హక్కులను పరిరక్షిస్తూ వివాహ వ్యవస్థ ఒడిదుడుకులకు గురికాకుండా అవగాహన, సామాజిక చైతన్యంతో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. మహిళా కమిషన్ సభ్యులు లైంగిక సంబంధాల విషయంలో భార్యలపై దాష్టికం జరుగుతున్న కేసులను వివరించారు. భర్తలపై రేప్ కేసులు నమోదు చేసే విషయంలో చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయని.. అవగాహనతో కూడిన అంశం అయినందున చట్టంగా రూపొందించే విషయంలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించాల్సి ఉంటుందని మహిళా కమిషన్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..