Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ప్రాంతాలను కలుపుతూ రాజధాని అమరావతికి రైల్వే లైన్..

ఆంధ్రప్రదేశ్‎లో అలా ప్రభుత్వం మారిందో లేదో ఇలా కొత్త ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. అమరావతిని త్వరితగతన పూర్తిచేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రారంభ సమయంలో అనేక ప్రాజెక్టులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆయా ప్రాజెక్టులను తిరిగి గాడినపెట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది.

ఈ ప్రాంతాలను కలుపుతూ రాజధాని అమరావతికి రైల్వే లైన్..
Amaravathi
Follow us
pullarao.mandapaka

| Edited By: Srikar T

Updated on: Jun 23, 2024 | 4:19 PM

ఆంధ్రప్రదేశ్‎లో అలా ప్రభుత్వం మారిందో లేదో ఇలా కొత్త ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. అమరావతిని త్వరితగతన పూర్తిచేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రారంభ సమయంలో అనేక ప్రాజెక్టులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆయా ప్రాజెక్టులను తిరిగి గాడినపెట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఓవైపు అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటే.. కొన్ని సంస్థలు కూడా అదే బాటలో ముందుకు వస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రైల్వేలైన్ కోసం ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు ఈ రైల్వే లైన్‎కు భూసేకరణ కోసం రైల్వే శాఖ ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది. గత టిడిపి ప్రభుత్వంలోని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఈ రైల్వే లైను నిర్మించాలని నిర్ణయించారు.

అయితే వైఎస్ఆర్సీపి ప్రభుత్వం మాత్రం ఈ రైల్వేలైన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెబుతున్నారు కొందరు టీడీపీ నాయకులు. గత ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో రైల్వే లైన్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శిస్తున్నారు. అయితే ఈ రైల్వే లైన్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నుంచి కొంత మొత్తంలో భూమిని ఇవ్వాల్సి ఉంది. దీంతో గత ప్రభుత్వం ఏదో ఒక కారణం చెప్పి నిధుల విషయంలో ముందుకు రాలేదని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 56.53 కి.మీ కొత్త లైన్ వేసేందుకు అడుగులు ముందుకుపడ్డాయి. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణకు రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

అమరావతి రైల్వే లైన్‎ అనుసంధానం ఇలా..

గత టిడిపి ప్రభుత్వంలో రాజధాని అమరావతిని ఓవైపు విజయవాడ.. మరోవైపు గుంటూరు రైల్వే లైన్‎లకు అనుసంధానం చేశారు. అయితే తాజాగా అమరావతి రైల్వే ప్రాజెక్టును ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 56.53 కి.మీ మేర డబుల్ లైను, అమరావతి – పెదకూరపాడు మధ్య 24.5 కి.మీ మేర సింగిల్ లైన్, సత్తెనపల్లి – నరసరావుపేట మధ్య 25 కి.మీ సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కి.మీ మేర కొత్త లైనుకు ఆమోదం పడింది. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆరేళ్ల పాటు ఎలాంటి కదలిక లేదు. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత పనుల్లో వేగం ఊపందుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…