Tirupati: డిన్నర్ చేస్తుండగా ప్లేట్‌లో కనిపించింది చూసి.. బాబోయ్.! ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మెస్‌లో మరోసారి నిర్లక్ష్యం బయటపడింది. కొందరు విద్యార్ధులు మెస్‌లో భోజనం చేస్తుండగా.. ఓ ఆకారం కనిపించింది. దాన్ని చూసి దెబ్బకు షాక్ అయ్యారు. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.

Tirupati: డిన్నర్ చేస్తుండగా ప్లేట్‌లో కనిపించింది చూసి.. బాబోయ్.! ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది
Food

Edited By:

Updated on: Feb 08, 2025 | 10:23 AM

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మెస్‌ల నిర్వహణలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. విద్యార్థుల భోజనంలో తరచూ జెర్రీ, బొద్దింకలు వస్తున్నాయంటూ విద్యార్థుల ఫిర్యాదులు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే నిన్న రాత్రి మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. బీ-బ్లాక్ మెస్‌లో జెర్రీ కలకలం రేపింది. రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థుల ప్లేట్‌లో జెర్రీ ప్రత్యక్షమైంది. రాత్రి 8.30 గంటల సమయంలో కొందరు విద్యార్థులు కలిసి భోజనం చేస్తుండగా జెర్రీని గుర్తించారు.

విషయాన్ని హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళారు. ఈ మధ్యనే భోజనంలో బొద్దింకను చూసిన స్టూడెంట్స్ ఇప్పుడు జర్రీని చూసి మెస్ సిబ్బందిని నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మెస్ సిబ్బందితో స్టూడెంట్స్ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న మెస్ నిర్వాహకుడు లోకేష్‌తో గొడవపడ్డారు. జెర్రీ పడ్డ మాట వాస్తవమని అంగీకరించిన మెస్ నిర్వాహకులు.. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామని చెప్పి అక్కడి నుంచి తప్పుకున్నాడు. కాగా, తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి