CBI Court: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు.. బుధవారానికి విచారణ వాయిదా..
CBI Court: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులపై మంగళవారం నాడు విచారణ జరిగింది. పలు కేసులపై విచారించిన న్యాయస్థానం..
CBI Court: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులపై మంగళవారం నాడు విచారణ జరిగింది. పలు కేసులపై విచారించిన న్యాయస్థానం.. పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల్లో అభియోగాల నమోదుపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇక ఓబుళాపురం గనుల కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు మరోసారి గడువు కోరారు. దాంతో ఈ కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు. ఇక విదేశాలకు వెళ్లేలా బెయిల్ షరతులు సడలించాలని కోరుతూ నిమ్మగడ్డ ప్రసాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. నిర్ణయం వెల్లడిని బుధవారానికి వాయిదా వేసింది.
Also read:
Tea Plant: తేయాకును కొండ ప్రాంతాల్లోనే ఎందుకు పండిస్తారు..? అసోం టీ ప్రత్యేకత ఏమిటి..?