AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!

తిరుపతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ పై కేసు నమోదు అయ్యింది. యూట్యూబర్ కల్లూరి హేమాద్రి తోపాటు నాగవర్ధిని అనే మహిళ పై కూడా తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తిరుపతి రూరల్ మండలం మంగళం క్వార్టర్స్‌లో ఉంటున్న యువతిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదు అందింది.

యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
Stop Violence
Raju M P R
| Edited By: |

Updated on: May 31, 2025 | 5:37 PM

Share

తిరుపతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ పై కేసు నమోదు అయ్యింది. యూట్యూబర్ కల్లూరి హేమాద్రి తోపాటు నాగవర్ధిని అనే మహిళ పై కూడా తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తిరుపతి రూరల్ మండలం మంగళం క్వార్టర్స్‌లో ఉంటున్న యువతిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హేమాద్రి ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ ద్వారా యువతికి అసభ్య మెసేజ్‌లు చేసి ఇబ్బంది పెట్టినట్లు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో బాధితురాలు పేర్కొంది. గత 5 నెలలుగా తన కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నువ్వంటే పిచ్చని లొంగకపోతే జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసింది. లేదంటే కుటుంబ సభ్యులను కూడా చంపుతానని బెదిరించినట్లు పోలీసులకు బాధితురాలు తెలిపింది.

ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని కల్లూరి హేమాద్రి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బాధితురాలు స్టేట్‌మెంట్ ఇచ్చింది. మంగళం క్వార్టర్స్ లో ఉన్న వివాహితను నాగవర్ధిని ఇంటికి పిలిపించి బెదిరించిన యూట్యూబర్ కల్లూరి హేమాద్రి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు యూట్యూబర్ హేమాద్రి అతని సన్నిహితురాలు నాగవర్ధని ఇద్దరినీ అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్