MLA Balakrishna: బాలయ్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. రీజన్ ఎందుకంటే..

|

Jan 30, 2022 | 12:46 PM

MLA Balakrishna: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లో కొత్త జిల్లాల(AP New Districts) ఏర్పటుకు సీఎం జ‌గ‌న్ స‌ర్కార్ స్వర్వం సిద్ధం చేస్తోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు పై మిశ్రమ స్పందన వస్తోంది..

MLA Balakrishna: బాలయ్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. రీజన్ ఎందుకంటే..
Balarkishna Missing '
Follow us on

MLA Balakrishna: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లో కొత్త జిల్లాల(AP New Districts) ఏర్పటుకు సీఎం జ‌గ‌న్ స‌ర్కార్ స్వర్వం సిద్ధం చేస్తోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు పై మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని చోట్ల కొత్త జిల్లా ఏర్పాటు పై ఆందోళన చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనను కొందరూ స్వాగ‌తిస్తుంటే.. మరికొందరు పేర్లు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో నిరసనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.అయితే.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ స్పందించ‌డం లేదు. నిరసనకు మద్దతు చెప్పడం లేదు.. దీంతో నిర‌స‌న కారులు ప్రజా ప్రతినిధిలు క‌న‌బ‌డ‌టం లేదని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నిర‌స‌నకారులు స్థానిక వన్‌టౌన్ పోలీసు సేష్ట‌న్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ లు క‌న‌బ‌డ‌టం లేద‌ని ఫిర్యాదు చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా… వీరిలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారంతా బయటికి వచ్చి, వెంటనే పదవులకు రాజీనామా చేసి, హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు

 

Also Read:

భర్తను చంపి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన భార్య.. అసలు విషయంతో పోలీసుల షాక్!