Andhra Pradesh: మైలవరం వైసీపీలో వర్గ విభేదాలు సమసిపోయేనా? సీఎం జగన్ వద్దకు పంచాయితీ

|

Feb 09, 2023 | 1:53 PM

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం వైసీపీలో పంచాయతీ మరోసారి సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లబోతోంది. ఇవాళ (ఫిబ్రవరి 09) సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్‌ను కలవనున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌.

Andhra Pradesh: మైలవరం వైసీపీలో వర్గ విభేదాలు సమసిపోయేనా? సీఎం జగన్ వద్దకు పంచాయితీ
Ap Politics
Follow us on

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం వైసీపీలో పంచాయతీ మరోసారి సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లబోతోంది. ఇవాళ (ఫిబ్రవరి 09) సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్‌ను కలవనున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌. ఇటీవల మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీకి, మంత్రి జోగి రమేష్‌కి మధ్య గ్యాప్‌ మరింత పెరిగింది. రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. గతంలోనే ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు వసంత కృష్ణప్రసాద్‌. ఆ తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ వివాదానికి ఆజ్యం పోసేలా రెండు రోజుల కిందట రీజనల్‌ కోఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌ దగ్గర ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం సీఎం జగన్‌ను కలబోతున్నారు వసంత కృష్ణప్రసాద్‌. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. కాగా గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ , మంత్రి జోగి రమేష్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. ఇటీవల వైసీపీ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్ దగ్గరకు కూడా మైలవరం పంచాయితీ చేరింది. అయితే మర్రి రాజశేఖర్ ఎదుటే ఇరు వర్గాల నేతలు బాహాబాహీకి దిగారు. కాగా ఈ వ్యవహారంపై బుధవారం (ఫిబ్రవరి 08) జరిగిన కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం జగన్‌ మంత్రి జోగి రమేశ్‌తో మాట్లాడారు. మైలవరంలో జరుగుతున్న వివాదాలపై సీఎం చర్చించినట్లు సమాచారం. ఇప్పుడిదే వ్యవహారంపై ఇవాళ సాయంత్రం సీఎం జగన్‌తో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ సమావేశం కానున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌. మొన్నామధ్య.. . గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాస్‌కి మద్దతుగా కామెంట్స్ చేశారు. అంతేకాదు 10 , 15 మంది చీడ, పీడల వల్లే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉండాలంటే చుట్టూ పది మంది పోరంబోకుల్ని ఉంచుకోవాలని తీవ్ర కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో కాదు, స్వపక్షంలో ఉంటూ.. వెన్నుపోటు పొడిచేవారిని సహించేదిలేదని తేల్చి చెప్పారు.ఇక వీరసింహారెడ్డి రిలీజ్‌ సందర్భంగా హీరో బాల‌కృష్ణ ఫోటోలతో పాటు అన్న ఎన్టీఆర్ ఫోటో కూడా ప్రింట్ చేయించి మరో ఆసక్తికర చర్చకు దారి తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..