కాకతీయతీయుల కాలంలో విరాజిల్లిన బౌద్దం..! కొత్తగా బయటపడ్డ మరో శాసనం

త్రిపురాంతకం చుట్టుపక్కల అనేక కాకతీయుల శాసనాలను కనుగొన్నాడు. కొత్తగా ఓ శాసనం లభించింది. ఈ శాసనం కాకతీయ రుద్రమదేవి కాలంనాటి 1285 నాటిది.

కాకతీయతీయుల కాలంలో విరాజిల్లిన బౌద్దం..! కొత్తగా బయటపడ్డ మరో శాసనం
Kakatiya Iinscription In Tripurantakam
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 22, 2024 | 8:44 PM

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో మరో చారిత్రాత్మక శాసనం బయటపడింది. త్రిపురాంతకం చుట్టుపక్కల ఇటీవల బయటపడ్డ కాకతీయుల అనేక శాసనాలతో పోలిస్తే, ఈ శాసనం భిన్నంగా ఉందని చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. శివారాధకులుగా ఉన్న కాకతీయులు సాధారణంగా శివాలయాలకు దానధర్మాలు, కైకంర్యాల కోసం దానాలు చేసినట్టు శాసనాలు ఉన్నాయి. అయితే తాజాగా లభించిన ఓ శాసనం అందుకు భిన్నంగా కాకతీయుల కాలంలోనే బౌద్దధర్మం కోసం భూములు దానమిచ్చినట్టు ఉండటం విశేషమంటున్నారు. ఈ శాసనం కాకతీయ రుద్రమదేవి కాలంనాటి 1285 సంవత్సరానిదని చెబుతున్నారు.

కాకతీయులు పదవ శతాబ్ధం నుండి పరిపాలించారు. వీరు ఎక్కువగా శైవారాధకులు. కాకతీయులు, వారి సామంతరాజులు, ప్రధానులు అనేక శైవాలయాలు నిర్మించారు. ఓరుగల్లు రాజధానిగా ఉన్నా వారికి ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంతో అవినాభావ సంబంధం ఉంది. రుద్రదేవుడు, గణపతిదేవుడు, మైలాంబ, రుద్రమదేవి, ప్రతాపరుద్రుని వరకు త్రిపురాంతకంతో సంబంధాలు కొనసాగించి ఇక్కడి శివాలయంలో పూజలు చేశారని అనవాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి వీరి శాసనాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. వీరి సామంతులు మాచయ నాయుడు, దేవరినాయనింగారు, కాయస్థ గంగయసాహిణి త్రిపురారిదేవుడు, జన్నిగదేవుడు, అంబదేవులు కూడా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుని సేవించినవారే.

త్రిపురాంతకంలో బౌద్దం ఆనవాళ్ళు…

కాకతీయుల కాలం నాటి అనేక శాసనాలు ఇక్కడ లభ్యమవుతున్నా, దాదాపు అన్నీ శివాలయాలకు దానాలిచ్చినవే. బౌద్దం గురించి దాదాపుగా లభ్యం కాలేదు. ఈమధ్య కాలంలో శాసన పరిశోధకులు తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్ త్రిపురాంతకం చుట్టుపక్కల అనేక కాకతీయుల శాసనాలను కనుగొన్నాడు. కొత్తగా ఓ శాసనం లభించింది. ఈ శాసనం కాకతీయ రుద్రమదేవి కాలంనాటి 1285 నాటిది. ఇది ముచలింద నాగ శాసనం. శాసనంలో స్పష్టంగా పంచమహాశబ్ధ మహామండలేశ్వర మాండలిక రుద్రదేవ మహారాజులు సుఖభోగాలతో పృధ్వీ రాజ్యము చేయుచున్నదని వ్రాయబడింది.

రుద్రమదేవిని చిన్నప్పటి నుండి మగవారిగా పెంచడంవల్ల రుద్రదేవునిగా సంభోదిస్తారు. 1289 లో వృద్దాప్యంలో రుద్రమదేవి అంబదేవుని చేతిలో మరణించిందని చరిత్రకారులు చెబుతారు. 1285 వరకు చాలా ఉత్సాహవంతురాలిగా రుద్రమదేవి ఉందని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. బొల్నాయునిమల్లికార్జున నాయకులు మెట్టవాడలోని (వినుకొండ, త్రిపురాంతకం, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, కురిచేడులోని కొన్ని ప్రాంతాలు), దువ్వలి కంపణము (ప్రస్తుతం త్రిపురాంతకం మండలంలో ఉన్న దువ్వలి) లోని వెల్మపల్లి (ఇప్పుడున్న ఊరిపేరు వెల్లంపల్లి, త్రిపురాంతకం మండలం) గ్రామాన్ని.. ధాన్యకటకము (అమరావతి)లోని బౌద్దాలయానికి అంగరంగ భోగాలకు… అలాగే బౌద్దదర్మ పరిభోగాలకు కృష్ణవేణి నది తీరమందు. రుద్రదేవ మహారాజుకు పుణ్యము కొరకు ధార పోసినట్లుగా లిఖించబడింది. ఈ శాసనంపై శాసనపరిశోధకులు, రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్ మాట్లాడుతూ కాకతీయుల కాలంవరకు బౌద్దమతం ఆదరణ పొందుతూ ఉందని ఈ శాసనం తెలపుతుందని తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో