AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: ప్రమాదంలో చనిపోయాడు అనుకున్నారు.. కానీ పోలీసు విచారణలో

వేజెండ్లకు చెందిన రామక్రిష్ణా రెడ్డి ఎప్పటి లాగే బుధవారం సైకిల్‌పై పొలానికి బయలు దేరాడు. అయితే కొద్దిసేపటికే ట్రాక్టర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఎందుకో వారికి అనుమానం వచ్చింది. 

Guntur: ప్రమాదంలో చనిపోయాడు అనుకున్నారు.. కానీ పోలీసు విచారణలో
Chebrolu
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 19, 2023 | 6:22 PM

Share

ట్రాక్టర్‌తో గుద్ది చంపి ఆ పెద్ద మనిషిని చంపేశారు. ఆపై ప్రమాదంగా చిత్రీకరించి ఎస్కేప్ అవ్వాలని భావించారు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే..  రామక్రిష్ణారెడ్డి వయస్సు డెభ్బై రెండు సంవత్సరాలు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్లకు చెందిన రామక్రిష్ణా రెడ్డి ఎప్పటి లాగే బుధవారం సైకిల్‌పై పొలానికి బయలు దేరాడు. అయితే కొద్దిసేపటికే ట్రాక్టర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఎందుకో వారికి అనుమానం వచ్చింది.  అంకిరెడ్డి అనే చంపి ఉంటాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అంకిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

మొదట ట్రాక్టర్ బ్రేక్స్ ఫెయిల్ అవ్వటంతో ప్రమాదం జరిగిందని చెప్పిన అంకిరెడ్డి తర్వాత తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 2006లో రామక్రిష్ణా రెడ్డి, అంకిరెడ్డి, సత్తార్ అనే ముగ్గురు కలిసి 2.95 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. భూమిని వాటాలు వేసుకునే క్రమంలో ముగ్గురు మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే అంకిరెడ్డి తన వాటాను అమ్ముకునే ప్రయత్నం చేశాడు. అయితే రామక్రిష్ణారెడ్డి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ఇక అప్పటి నుండి అంకిరెడ్డి… రామక్రిష్ణా రెడ్డిని చంపుతానంటూ బెదిరిస్తున్నాడు.

చెప్పినట్లుగానే సమయం కోసం అంకిరెడ్డి వేచి చూశాడు. బుధవారం రామక్రిష్ణారెడ్డి ఒక్కడే పొలానికి వెళ్తుండటాన్ని గమనించాడు. ఆ తర్వాత ట్రాక్టర్‌పై వెళ్లి గుద్ది చంపాడు. బ్రేక్స్ ఫెయిల్ అయినట్లు అంకిరెడ్డి చెప్పడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ విజువల్స్ పరిశీలించడంతో గుట్టు వీడింది. రామక్రిష్ణారెడ్డిని మొదట దాటుకొని వెళ్లి వెనక్కి తిరిగి వస్తూ ట్రాక్టర్‌తో గుద్దినట్లు సీసీ టీవీలో క్లియర్‌గా రికార్డయ్యింది. దీంతో అంకిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.