Andhra Pradesh: బైక్ కి సైకిల్ అడ్డు పెట్టినందుకు.. పెట్రోల్ పోసి తగులబెట్టారు.. బాపట్ల జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు

ఉప్పాలవారిపాలెంకు చెందిన అమర్నాథ్ పదవ తరగతి చదువుతున్నాడు. బడులు తిరిగి ప్రారంభించడంతో మూడు రోజుల నుండి ఉదయాన్నే ట్యూషన్ కి వెలుతున్నాడు. ఈ రోజు తెల్లవారు జామున సైకిల్ వెలుతున్న బాలుడిని రెడ్డి పాలెం వద్ద నలుగురు యువకులు అడ్డగించారు.

Andhra Pradesh: బైక్ కి సైకిల్ అడ్డు పెట్టినందుకు.. పెట్రోల్ పోసి తగులబెట్టారు..  బాపట్ల జిల్లాలో భగ్గుమన్న  పాత కక్షలు
Crime

Updated on: Jun 16, 2023 | 1:48 PM

బాపట్ల జిల్లా, జూన్ 16: రేపల్లె నియోజకవర్గం ఉప్పాల వారి పాలెంలో అమానుష ఘటనా చోటుచేసుకుంది. ట్యూషన్ కి వెలుతున్న పదిహేనేళ్ల బాలుడిపై దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఉప్పాలవారిపాలెంకు చెందిన అమర్నాథ్ పదవ తరగతి చదువుతున్నాడు. బడులు తిరిగి ప్రారంభించడంతో మూడు రోజుల నుండి ఉదయాన్నే ట్యూషన్ కి వెలుతున్నాడు. ఈ రోజు తెల్లవారు జామున సైకిల్ వెలుతున్న బాలుడిని రెడ్డి పాలెం వద్ద నలుగురు యువకులు అడ్డగించారు. బాలుడిని కొట్టుకుంటూ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్ళారు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. తీవ్ర గాయాలపాలైన అమర్నాథ్ ను కుటుంబ సభ్యులు గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

అయితే పెట్రోల్ పోసినా నలుగురు యువకుల్లో ఒకరిని బాలుడు గుర్తించాడు. రెడ్డి పాలెం కు చెందిన పాము వెంకటేశ్వరెడ్డి మరో ముగ్గురితో కలిసి వచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టనట్లు చెప్పాడు. గతంలో కూడా వెంకటేశ్వరరెడ్డి… అమర్నాథ్ ను ఆటోలో తీసుకెళ్ళి కొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ కు సైకిల్ అడ్డుపెట్టినందుకు అమర్నాథ్ ను కొట్టినట్లు వెంకటేశ్వరెడ్డి చెప్పాడని కుటుంబ సభ్యులు చెప్పారు.

ఆ పాత కక్షల నేపధ్యంలోనే ఈ రోజు ట్యూషన్ కు వెలుతున్న అమర్నాథ్ ను కొట్టి పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లు మృతుడు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం