AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొబ్బిలి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు!

విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని బెర్రిఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్రాయిలర్‌ నుంచి మంటలు ఎగిసిపడటంతో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తిస్తోంది. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

బొబ్బిలి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు!
Bobbili Industrial Fire
Balaraju Goud
|

Updated on: Oct 06, 2026 | 9:02 PM

Share

విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని బెర్రిఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని బ్రాయిలర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాద సమయంలో భారీగా పొగలు వ్యాపించడంతో కార్మికులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు వారిని బయటకు తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బ్రాయిలర్‌ నుంచి మంటలు ఎగిసిపడటంతో పరిశ్రమలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పరిశ్రమల్లో తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల నేపథ్యంలో కార్మికుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బొబ్బిలి పారిశ్రామిక వాడలో జరిగిన ఈ ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us