Fire Accident: నడి సముద్రంలో అగ్నిప్రమాదం.. పూర్తిగా తగలబడ్డ పడవ! ఆ 11 మంది మత్స్యకారులు ఏమయ్యారో?
ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న బోట్ల ప్రమాదం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. బోట్ కింద అనంతమైన సముద్రం ఉన్నా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అరవై బోట్లు ఏకంగా భగ భగా మండిపోయాయి. కింద ఏకంగా సముద్రం ఉన్నా మంటలు ఆర్పలేకపోయారు. బయటి నుంచి ఫైర్ ఇంజన్‌లు వచ్చి బయట ప్రాంతాల్లో కంటే ఎక్కువగా శ్రమిస్తే తప్ప భారీ నష్టం తర్వాత మంటలు అదుపులోకి రాలేదు. ఈ సంఘటనను ఇంకా మరువక ముందే ఈరోజు కాకినాడ సముద్రంలో మరో ప్రమాదం జరిగింది..

విశాఖపట్నం, డిసెంబర్ 1: ఈ మధ్య కాలంలో సముద్రాలలో బోట్లు తగలబడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకొస్తున్నాయి. సాధారణంగా ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే భారీగా నీటిని స్ప్రెడ్ చేసి వాటిని ఆపే ప్రయత్నం చేస్తాం. అదే సముద్రంలోనే అగ్నిప్రమాదం జరిగితే వెంటనే ఆర్పేయవచ్చేమో అని భావిస్తాం..! కానీ బయట జరిగే ప్రమాదాల కంటే సముద్రంలో జరిగే ప్రమాదాల్లోనే నష్టం ఎక్కువ జరుగుతుందన విషయం చాలా మందికి తెలియదు.
ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న బోట్ల ప్రమాదం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. బోట్ కింద అనంతమైన సముద్రం ఉన్నా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అరవై బోట్లు ఏకంగా భగ భగా మండిపోయాయి. కింద ఏకంగా సముద్రం ఉన్నా మంటలు ఆర్పలేకపోయారు. బయటి నుంచి ఫైర్ ఇంజన్‌లు వచ్చి బయట ప్రాంతాల్లో కంటే ఎక్కువగా శ్రమిస్తే తప్ప భారీ నష్టం తర్వాత మంటలు అదుపులోకి రాలేదు. ఈ సంఘటనను ఇంకా మరువక ముందే ఈరోజు కాకినాడ సముద్రంలో మరో ప్రమాదం జరిగింది.
తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో అగ్నికి ఆహుతైన బోట్
అది కాకినాడ – భైరవ పాలెంకు మధ్యలో తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న డీప్ సీ. చేపల వేట కోసం ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కాకినాడకు చెందిన మత్స్యకారుడు జానకి రామ్‌కు చెందిన బోట్ నంబర్ INDM 49 బోట్‌లో 11 మంది మత్స్యకారులు బయల్దేరారు. వారంతా సుమారు 20 మైళ్ళ దూరం వెళ్ళే సరికి బోట్‌లో నుంచి మంటలు చెలరేగాయి. ఇంజిన్ వద్ద ఉన్న డీజిల్ టాంక్ నుంచి మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడంతో మత్స్యకారులు అంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. సముద్రంలో దుకినా 20 కిలో మీటర్ల దూరం నుంచి బయట పడడం అసాధ్యం. కళ్లముందే మృత్యువు కనిపిస్తుండటంతో అందరిలోనూ భయం. ఏ దేవుడైనా కాపాడితే బాగుండు అన్నట్టు అందరి దేవుళ్లను మొక్కుతూ ఉన్న సమయంలో ఏ దేవుడు వాళ్ళ మొర ఆలకించారో కానీ వాళ్ళను గమనించిన ఒక బోట్ వాళ్ళ వైపు వేగంగా రావడం కనిపించింది.

11 Fishermen
మత్స్యకారులను కాపాడిన రిలయన్స్ కేజీ డీ6 – ఆయిల్ అండ్ గ్యాస్ పెట్రోలింగ్ టీమ్
అదే సమయంలో అక్కడికి రిలయన్స్ కు చెందిన ఆయిల్ అండ్ పెట్రోల్ నిధుల అన్వేషణకు చెందిన పెట్రోలింగ్ సిబ్బంది సమీపంలో రక్షణ విధుల్లో ఉన్నారు. సముద్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక బోట్ మంటలలో చిక్కుకోవడం గమనించి అటుగా వచ్చారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన రిలయన్స్ పెట్రోలింగ్ సిబ్బందిని చూసిన మత్య్సకారులు మంటల్లో చిక్కుకుని కాపాడాలని వేడుకున్నారు. దీంతో అందులో ఉన్న 11 మంది మత్స్యకారులను ఆ బోట్ నుంచి రిలయన్స్ బోట్‌లోకి అత్యంత సాహసోపేతంగా మార్చగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కానీ 11 మంది మత్స్యకారులు రిలయన్స్ బోట్ లోకి మారిన వెంటనే జానకిరామ్ బోట్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. కళ్లముందే మృత్యువు తప్పడంతో ఆ 11 మంది తమను కాపాడిన రిలయన్స్ సిబ్బందికి చేతులెత్తి నమస్కరించారు.
ఆయిల్ పైప్ లైన్‌లకు ప్రమాదం కలగకుండా కోస్ట్ గార్డ్ చర్యలు
నడి సముద్రంలో తగలబడుతున్న బోట్ ను గమనించి క్రూని రెస్క్యూ చేసిన రిలయన్స్ గ్యాస్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే మరో ప్రమాదానికి అవకాశం ఉందని గుర్తించారు. సమిపంలోనే రిలయన్స్ గ్యాస్ టవర్ ఉండడంతో పెట్రోలింగ్ చేస్తోన్న సెక్యూరిటీ స్క్వాడ్ వెంటనే కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించారు. దీంతో కోస్ట్ గార్డ్ టీమ్స్ అక్కడకు చేరుకుని పూర్తిగా అగ్నికి ఆహుతై శిథిలాలుగా మారిపోయిన బోట్ నుంచి రిలయన్స్ బోట్‌ని దూరంగా తరలించారు. నడి సముద్రంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




