Andhra Pradesh: బీజేపీ సపోర్ట్‌తోనే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు.. సంచలన కామెంట్స్ చేసిన సీఎం రమేష్..
తదుపరి ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రమేష్ ఈ కామెంట్స్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అన్ని విషయాలు..
తదుపరి ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రమేష్ ఈ కామెంట్స్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అన్ని విషయాలు చర్చించారని తెలిపారు. నడ్డాతో మాట్లాడిన తరువాత పవన్ క్లారిటీతో ఉన్నారని పేర్కొన్నారు. జనసేన పార్టీ బీజేపీతోనే ఉందని తెలిపారు సీఎం రమేష్. రాష్ట్రంలో భారీ దోపిడీ జరుగుతోందని, ఈ దోపిడీపై చార్జిషీట్లు వేస్తామని అన్నారు.
కాగా, ఏపీలో అధికారమే లక్ష్యంగా కీలక అడుగులు వేస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న YCPపై ప్రత్యక్ష పోరాటానికి కార్యాచరణను ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రాష్ట్ర సర్కార్‌పై ఛార్జిషీట్లు వేయడం ఆ కార్యచరణలో మొదటి దశ. ఇందుకోసం పార్టీలోని 11 మంది సీనియర్లతో కమిటీ వేశారు కూడా. అయితే ఛార్జిషీట్లలో ఏఏ అంశాలు పొందుపర్చాలో నిర్ణయించేందుబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌లతో కమిటీ ఏర్పాటైంది. ప్లానింగ్ కమిటీ బాధ్యతలు సుజనాచౌదరికి అప్పగించారు.
రాష్ట్రవ్యాప్తంగా మిత్రపక్షం బీజేపీ కూడా సొంతంగా అజెండా ఫిక్స్ చేసుకుని జనాల్లోకి వెళుతోంది. కానీ ఇంతవరకూ జనసేన మాత్రం వారాహి యాత్రపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పైగా పొత్తులపై త్వరలో మేలు చేసే నిర్ణయం స్వయంగా తీసుకుంటా అని పవన్ విడుదల చేసిన లేఖ కాక రేపుతోంది. పదేపదే పవన్ అడుగుతున్న రోడ్‌మ్యాప్‌ను బీజేపీ ఇచ్చిందా? లేక ఇంకా ఇవ్వకుండానే దాటవేస్తుందా? ఇదే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రమేష్.. పై వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..