BJP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల బరిలో బీజేపీ.. ఏపీలో సెర్చ్ ఆపరేషన్ ప్లాన్..
ఏపీలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. అధికార వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ విడదల వారిగా జాబితాను విడుదల చేస్తోంది. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక కాంగ్రెస్ కూడా కోల్పోయిన జీవాన్ని తిరిగి పొందాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

ఏపీలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. అధికార వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ విడదల వారిగా జాబితాను విడుదల చేస్తోంది. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక కాంగ్రెస్ కూడా కోల్పోయిన జీవాన్ని తిరిగి పొందాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల వేట కొనసాగిస్తోంది. ప్రతి లోక్ సభ సెగ్మెంటుకు ముగ్గురేసి సభ్యుల కమిటీని నియమించింది అధిష్టానం.
ప్రతి నియోజకవర్గంలో ఆసక్తికలిగిన అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో వారి ఆర్థిక పరిస్థితులు, రాజకీయంగా గుర్తింపు, పోటీ ఏమేర ఇవ్వగలరు అనే పలు అంశాలను పరిశీలించనున్నారు. అందులో వడపోసి జాబితాను ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ట్ర యూనిట్ కు ఆదేశించింది. పొత్తలతో సంబంధం లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించింది. కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే పలు జిల్లాలకు చేరుకున్నారు త్రిసభ్య కమిటీ నేతలు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో పొత్తులపై ఆచితూచి వ్యవహరించాలని అధిష్టానం నిర్ణయించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




