AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్త్‌డే పార్టీలు హద్దు దాటితే జైలు శిక్ష తప్పదు.. పోలీసుల మాస్ వార్నింగ్

యువతలో పుట్టినరోజు వేడుకల పేరిట సాగుతున్న హంగామా మితిమీరిపోతోంది. నాలుగు గోడల మధ్య, కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాల్సిన జన్మదిన వేడుకలు కాస్తా, నేడు నడిరోడ్డుపైకి వచ్చి చేరుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ప్రధాన రహదారులను దిగ్బంధించి, కేకులు కట్ చేస్తూ, బాణాసంచా కాలుస్తూ వాహనదారులను, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతుండటంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. పబ్లిక్ న్యూసెన్స్ కలిగిస్తున్న ఆకతాయిల ఆటకట్టించేందుకు తణుకు పోలీసులు వినూత్న శైలిలో ఉక్కుపాదం మోపుతున్నారు..

బర్త్‌డే పార్టీలు హద్దు దాటితే జైలు శిక్ష తప్పదు.. పోలీసుల మాస్ వార్నింగ్
Tanuku Police On Birthday Celebrations
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 9:03 PM

Share

ఏలూరు, జూన్‌ 5: తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి ఇప్పుడు ఈ తరహా వేడుకలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా తణుకు జాతీయ రహదారి పరిధిలోని శర్వాణి థియేటర్ సెంటర్ సర్వీస్ రోడ్డు, ఎన్టీఆర్ పార్క్, ప్రధాన కూడళ్లు, వెంకటేశ్వర థియేటర్ తదితర ప్రాంతాలు అర్ధరాత్రి వేళల్లో ఆకతాయిల అడ్డాగా మారుతున్నాయి. యువత తమ స్నేహితుల పుట్టినరోజు వేడుకలను ఇక్కడే నిర్వహిస్తూ హద్దులు దాటుతున్నారు. కేవలం కేకులు కట్ చేయడంతో ఆగకుండా, నడిరోడ్డుపై భారీగా బాణాసంచా కాలుస్తూ హడావుడి చేస్తున్నారు. తణుకు జాతీయ రహదారిపై కొందరు యువకులు ఏకంగా రోడ్డు మధ్యలో బాణాసంచా లడీలను పరిచి కాలుస్తూ తీవ్ర అలజడి సృష్టిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా బాణాసంచా కాల్పుల వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులపై నిప్పురవ్వలు పడి దుస్తులు కాలిపోవడం, ఒంటికి గాయాలైన ఘటనలు కూడా తణుకులో వెలుగుచూశాయి.

Also Read: పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్‌ విసిరే చిక్కు ప్రశ్న

మందు పార్టీలు, బైక్ స్టంట్లు.. మితిమీరుతున్న ఆకతాయిల ఆగడాలు

రోడ్లపై సాగే ఈ బర్త్‌డే వేడుకలు కేవలం కేక్ కటింగ్స్, టపాసులకే పరిమితం కావడం లేదు. అదే ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, మత్తులో బైక్‌లతో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ రేసింగులకు దిగడం వంటి ఆకృత్యాలు ఎక్కువయ్యాయి. వేగంగా దూసుకువచ్చే వాహనాలతో అర్ధరాత్రి వేళల్లో ప్రయాణించే వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. స్థానికుల నుంచి, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తణుకు పోలీసులు ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించారు.

పోలీసుల యాక్షన్ ప్లాన్: 120 మంది యువకులకు కోర్టు ద్వారా జరిమానాలు, ఎఫ్‌ఐఆర్‌లు

గత నెలరోజుల కాలంలో తణుకు పోలీసులు క్షేత్రస్థాయిలో విస్తృత నిఘా ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై ఇబ్బందులు సృష్టించిన సుమారు 120 మంది ఆకతాయి యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కేవలం హెచ్చరించి వదిలిపెట్టకుండా, న్యాయస్థానాల్లో హాజరుపరిచి భారీగా జరిమానాలు విధించారు. కొంతమంది తీవ్రతను బట్టి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లు సైతం నమోదు చేయడం విశేషం. పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఇటువంటి పనులు పునరావృతమైతే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

తణుకు పోలీస్ ప్రత్యేక పోస్టర్ విడుదల: తల్లిదండ్రులకు కీలక విజ్ఞప్తి

ఈ సామాజిక రుగ్మతపై కేవలం లాఠీ ఝుళిపించడమే కాకుండా, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తణుకు పోలీస్ అధికారులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక అవేర్‌నెస్ పోస్టర్‌ను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరపడం వల్ల సమాజానికి కలిగే ఇబ్బందులను, శాంతిభద్రతల సమస్యలను చిత్రాల రూపంలో వివరించారు. తమ బిడ్డలు పుట్టినరోజు వేడుకల పేరిట రోడ్లపైకి వెళ్లి జీవితాలను పాడుచేసుకోకుండా, ఇళ్లలోనే కుటుంబ సభ్యుల మధ్య పండుగలా జరుపుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను అదుపులో ఉంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తణుకు పట్టణ పరిధిలో ఎక్కడైనా రహదారులపై పుట్టినరోజు వేడుకల పేరిట రగడ సృష్టించినా, బైక్ స్టంట్లు లేదా బహిరంగ మద్యపానంతో ఇబ్బందులు కలిగిస్తున్నా వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ప్రజల రక్షణ కోసం, తక్షణ ఫిర్యాదుల నిమిత్తం కింది టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.

  • అత్యవసర సహాయం (టోల్ ఫ్రీ): 112
  • తణుకు పట్టణ సీఐ (CI): 9440796640
  • తణుకు పట్టణ ఎస్సై (SI): 9154965934

పట్టణ ప్రశాంతతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, నిబంధనలు మీరితే చట్టరీత్యా కఠినమైన జైలు శిక్షలు, కోర్టు జరిమానాలు తప్పవని తణుకు పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది. యువత సైతం క్షణికావేశంలో చేసే ఇటువంటి పనుల వల్ల తమ బంగారు భవిష్యత్తును, కెరీర్‌ను నాశనం చేసుకోవద్దని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.

Follow Us
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?