AP Politics: వైసీపీ ఒక రూట్‌లో.. విపక్ష పార్టీలు మరో రూట్‌లో

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యూహాలకు పదునుపెట్టాయి ప్రధాన పార్టీలు. అయితే ఒక్కో పార్టీది ఒక్కో ఎజెండా. ఒక్కో నినాదం అన్నట్టుగా ఉంది పరిస్థితి. అధికార వైసీపీ ఒక రూట్‌లో వస్తుంటే... విపక్ష పార్టీలు మరో రూట్‌లో వస్తున్నాయి.. ఇంతకీ జనం ఎవరి రూట్‌లోకి రాబోతున్నారు? అసలు ఓటర్ల మైండ్‌లోకి చొచ్చుకెళ్తున్న నినాదమేంటి? అన్నదే ఆసక్తి రేపుతోంది.

AP Politics: వైసీపీ ఒక రూట్‌లో.. విపక్ష పార్టీలు మరో రూట్‌లో
Big News Big Debate
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 04, 2024 | 7:12 PM

విశ్వసనీయత ఒకపైపు.. మోసం మరోవైపు…   చాలారోజులుగా.. ఎప్పుడు జనంలోకి వచ్చినా… ఏపీ సీఎం జగన్‌ చెబుతున్న మాట ఇది. విశ్వసనీయత అనే నినాదంతో ముందుకెళ్తూ జనాన్ని ఓట్లు అభ్యర్థిస్తున్న ఆయన.. మీ ఇంటికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి ఎంత? వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి ఎంత? అని బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారు. తమ హయాంలో మంచి జరిగిందనుకుంటేనే వైసీపీకి ఓటు వేయాలని స్పష్టం చేస్తున్నారు.

అయితే, విశ్వసనీయత కాదు.. రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ విధ్వంసం సృష్టించిందంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని కొన్నేళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లారనీ.. జగన్‌ పాలనలో ఆగడాలు పెరిగిపోయాయనీ ఆరోపిస్తున్నారు. ఏపీని రాజధానిలేని రాష్ట్రంగా మార్చేశారంటూ.. అంశాలవారీగా ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు.

విపక్ష నాయకుడి విమర్శలకు అదేస్థాయిలో కౌంటర్‌ ఇస్తు్న్నారు వైసీపీ నాయకులు. చేసింది, చేయబోయేది ఏమీ లేకపోవడం వల్లే… జగన్‌ను టార్గెట్‌ చేస్తూ కూటమి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాము ప్రజలకు మంచి చేశాం కాబట్టే పాజిటివ్‌ ఎజెండాతో ముందుకెళ్తున్నామనీ… కూటమిదంతా నెగెటివ్‌ ప్రచారమేననీ చెప్పారు.

జరిగిన మంచిని గమనించండి అంటూ వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంటే… జగన్‌ పాలనలో మైనస్‌లను జనాల్లోకి తీసుకెళ్లేందుకు విపక్షం ప్రయత్నిస్తోంది. విశ్వసనీయత అని ఒకరు అంటుంటే… అంతా మోసమని మరొకరు వాదిస్తున్నారు. మరి, జనం మనసులో ఏ నినాదం ఉందన్నదే ఇప్పుడు పొలిటికల్‌గా ఆసక్తిరేపుతున్న అంశం. జనం దృష్టిలో పాజిటివ్‌ ఎవరు? నెగెటివ్‌ ఎవరు? అనేది తెలిసేది మాత్రం ఎన్నికల ఫలితాల రోజేనన్నది మాత్రం క్లియర్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి