AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate Live: ఏపీలో కాక రేపుతోన్న రుణ రాజకీయాలపై.. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌

ఏపీలో మళ్లీ రుణాలపై రాజకీయ రణగొణలు మొదలయ్యాయి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారంటూ గత కొద్దిరోజులుగా బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు రుణాల విషయంలో రాష్ట్రం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా ఫిర్యాదు చేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అప్పులపై రాష్ట్ర బీజేపీ ఆరోపణలతో పాటు.. కొందరు ఎంపీలు పార్లమెంట్‌లోనూ వరస ప్రశ్నలు సంధించారు. అయితే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా పార్లమెంటులో చేసిన ప్రకటనలు...

Big News Big Debate Live: ఏపీలో కాక రేపుతోన్న రుణ రాజకీయాలపై.. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌
Big News Big Debate
Narender Vaitla
|

Updated on: Aug 03, 2023 | 7:06 PM

Share

పార్లమెంట్ సాక్షిగా ఏపీలో మరోసారి రుణాలపై రాజకీయ రణరంగం జరుగుతోంది. రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని బీజేపీ ఆరోపణలు చేస్తుంటే.. కేంద్రం చెప్పిన సమాధానం చూసిన తర్వాత కూడా అదే మాటకు కట్టుబడి ఉంటారా అంటూ ప్రశ్నిస్తోంది వైసీపీ ప్రభుత్వం. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన రుణాలు దాచిపెడుతున్నారని విపక్షాలు అంటే… ఆంతా ఓపెన్‌ అంటూ మొత్తం చిట్టాను బయటపెట్టారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.

ఏపీలో మళ్లీ రుణాలపై రాజకీయ రణగొణలు మొదలయ్యాయి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారంటూ గత కొద్దిరోజులుగా బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు రుణాల విషయంలో రాష్ట్రం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా ఫిర్యాదు చేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అప్పులపై రాష్ట్ర బీజేపీ ఆరోపణలతో పాటు.. కొందరు ఎంపీలు పార్లమెంట్‌లోనూ వరస ప్రశ్నలు సంధించారు. అయితే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా పార్లమెంటులో చేసిన ప్రకటనలు రాష్ట్రంలో అధికార వైసీపీలో ఉత్సాహాన్ని నింపాయి. చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే జగన్ సర్కార్ చేసిన అప్పు కేవలం లక్ష 77వేల కోట్లు మాత్రమేనని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అయితే ఆర్థికమంత్రి చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి స్పందించారు. కేవలం FRBM పరిధిలో అప్పలు గురించి మాత్రమే కేంద్ర మంత్రి ప్రస్తావించారని.. కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులే రాష్ట్రంలో ఎక్కువంటూ వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేశారు. అప్పులపై ఆరోపణలు చేయడం అందరికీ అలవాటుగా మారిందని.. కొందరు ఫ్రెషర్స్‌ వచ్చి తెలిసి తెలియక మాట్లాడుతున్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. కేంద్ర మంత్రి సమాధానం కంటే కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పే వివరాలే నిజమని నమ్మాలా అంటూ ప్రశ్నించారు బుగ్గన. అంతేకాదు గత ప్రభుత్వంలో చేసిన అప్పులు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న రుణాలపై వైట్‌ పేపర్‌ తరహాలో వివరాలు వెల్లడించారు మంత్రి.

ఇవి కూడా చదవండి

మొత్తానికి పార్లమెంట్‌ వేదికగా వచ్చిన సమాధానాన్ని అధికారపార్టీ ఆయుధంగా మలుచుకుంటే.. బడ్జెటేతర అప్పులపై విపక్షాల ఫోకస్ పెట్టి జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకీ ఎవరి లెక్కలు నిజం? మరెవరిది విషప్రచారం? ఏపీని కుదిపేస్తున్న రుణ రాజకీయాలపై బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌..

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..