Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ లోని సినిమా థియేటర్స్ టికెట్ ధర విషయంపై వివాదం నెవ్వర్ ఎండింగ్ స్టోరీలా కొనసాగుతూనే ఉంది. టికెట్ ధర విషయంలో తగ్గేదేలే అంటూ ప్రభుత్వం పట్టుబట్టి ఉండగా… సినీ పరిశ్రమలోని పెద్దలు పెద్ద సినిమాల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విప్లవ నటుడు ఆర్ నారాయణ మూర్తి ఇప్పటికే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో .. థియేటర్ యాజమన్యంతో కలిసి భేటీ అయ్యారు.. కాగా సంచలన దర్శకుడు.. వివాదాల వర్మ కూడా ఏపీ ప్రభుత్వం టికెట్స్ ధర విషయంలో తీసుకున్న నిర్ణయం పై తనదైన శైలిలో స్పందించారు. ఏకంగా ఏపీ ప్రభుత్వాన్ని కరోనా తో పోలుస్తూ.. సంచలన కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు.. ఓ ఇద్దరి హీరోల కోసం సినీ పరిశ్రమలోని చిన్న హీరోలను ఇబ్బంది పెడుతున్నారేమో నాకు తెలియదంటూ ప్రభుత్వం తీరుపై సంచలన కామెంట్స్ చేశారు.
రేకుల షెడ్డు థియేటర్, మల్టి ప్లెక్స్ .. సినిమా టికెట్ ధరఒకటే అంటున్న తీసుని కాకా హోటల్, ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ ధరలతో పోలుస్తూ.. మరి వీటి ధరలను కూడా సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తారా అంటూ ఏపీ ప్రభుత్వం ముందు అనేక ప్రశ్నలను ఉంచారు వర్మ.. ఈ నేపథ్యంలో సాయంత్రం 7 గంటలకు TV9 తెలుగు ఛానల్ లో జరిగే బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో మళ్ళీ తనదైన శైలిలోతన గళం వినిపించడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని సినిమా థియేటర్ టికెట్ ధరలపై రజనీకాంత్ గారితో జరిగే చర్చా కార్యక్రమంలో ఆర్జీవీ పాల్గొననున్నారు.
Me on TV 9 tonite at 7 pm about AP ticket rates
— Ram Gopal Varma (@RGVzoomin) January 3, 2022
Also Read: మూవీ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. ఓటీటీ వేదికగా ఒకే నెలలో మూడు భారీ చిత్రాలు..