TDP: ‘ఆ ఎమ్మెల్యే టికెట్ ఆమెకు తప్ప ఇంకెవరికైనా ఓకే’.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు..
ఆళ్లగడ్డ తనదే అంటుంది ఆవిడ. ఆమె తప్ప ఎవరైనా ఓకే అంటారు ఆయన. పార్టీ ఆదేశిస్తే తానే పోటీ చేస్తానంటారు. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గ పోరు రచ్చకెక్కింది. ఆళ్లగడ్డ పంచాయితీ టీడీపీ హైకమాండ్‌ను పరేషాన్ చేస్తోంది. అది ఎవరి గడ్డ అనేది తేల్చలేక పార్టీ సతమతమవుతోంది. ఆళ్లగడ్డ.. ఒకప్పుడు బాంబుల గడ్డ. ఫ్యాక్షన్‌కి అడ్డా. అవన్నీ రక్త చరిత్రలో సమాధి అయిపోయాయి.

ఆళ్లగడ్డ తనదే అంటుంది ఆవిడ. ఆమె తప్ప ఎవరైనా ఓకే అంటారు ఆయన. పార్టీ ఆదేశిస్తే తానే పోటీ చేస్తానంటారు. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గ పోరు రచ్చకెక్కింది. ఆళ్లగడ్డ పంచాయితీ టీడీపీ హైకమాండ్‌ను పరేషాన్ చేస్తోంది. అది ఎవరి గడ్డ అనేది తేల్చలేక పార్టీ సతమతమవుతోంది. ఆళ్లగడ్డ.. ఒకప్పుడు బాంబుల గడ్డ. ఫ్యాక్షన్‌కి అడ్డా. అవన్నీ రక్త చరిత్రలో సమాధి అయిపోయాయి. కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే ఆళ్లగడ్డలో ఇప్పుడు ఫ్యాక్షన్ పెద్దగా లేకపోయినా, కావాల్సినంత పొలిటికల్ యాక్షన్ ఉంది. భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వర్గపోరు.. డైలీ సీరియల్‌లా రాజుకుంటూనే ఉంటుంది. మొన్ననే ఆళ్లగడ్డలో టీడీపీ నిర్వహించిన రా కదలి రా సభకు.. ఏవీ సుబ్బారెడ్డి రాకూడదంటూ అల్టిమేటం ఇచ్చి పంతం నెగ్గించుకున్నారు భూమా అఖిల ప్రియ. పార్టీ పెద్దలు చెప్పడం వల్లనే రాలేదు.. నన్నెవ్వడూ ఆపేది అంటూ సుబ్బారెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఆళ్లగడ్డ తన గడ్డ అంటున్నారు ఆయన.
తాజాగా ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ కోసం రెండు వర్గాల మధ్య మరోసారి ఫైటింగ్ మొదలైంది. ఇరువైపుల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ తనదే అంటున్నారు అఖిల. తనకు తప్ప మరెవ్వరికీ టికెట్ ఇవ్వకూడదంటున్నారు ఆమె. అయితే ఆళ్లగడ్డ టికెట్ రేసులో తాను కూడా ఉన్నానంటున్నారు సుబ్బారెడ్డి. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానంటున్నారు ఆయన. ఒకవేళ తనకు టికెట్ రాకపోయినా ఫరవాలేదు కానీ.. భూమా కుటుంబానికి, అఖిల ప్రియకు మాత్రం టికెట్ ఇవ్వకూడదంటున్నారు ఏవీ సుబ్బారెడ్డి. టీడీపీ అధిష్టానం.. భూమా కుటుంబానికి, అఖిల ప్రియకు తప్ప ఇంకెవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తానంటున్నారు సుబ్బారెడ్డి. ఆళ్లగడ్డలో అఖిల, ఏవీ సుబ్బారెడ్డి పంచాయితీ..అక్కడి కేడర్‌కే కాదు, టీడీపీ అధిష్టానానికి కూడా తలబొప్పి కట్టిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




