Congress: ఏపీలో కొత్తగా చిగురించిన కాంగ్రెస్.. ఈ నేతల కోసం ఎదురుచూపులు..
ఏపీకి ఎన్నికల జ్వరం పట్టుకుంది. ఇన్‌ఛార్జీల మార్పుతో ఆ వేడిని ఇంకా పెంచేస్తోంది అధికార వైసీపీ. ఇక మిత్రసేన జనసేనతో కలిసి సైకిల్ సైన్యం పొత్తుల లెక్కలతో కుస్తీ పడుతోంది. ఇక ఇదే సందని సందట్లో సడేమియాలా కాంగ్రెస్ కూడా పావులు కదుపుతోంది. వైసీపీ, టీడీపీల్లో టికెట్లు రానివాళ్లను పట్టుకునేందుకు వల వేసి కూర్చుంది హస్తం పార్టీ.

ఏపీకి ఎన్నికల జ్వరం పట్టుకుంది. ఇన్‌ఛార్జీల మార్పుతో ఆ వేడిని ఇంకా పెంచేస్తోంది అధికార వైసీపీ. ఇక మిత్రసేన జనసేనతో కలిసి సైకిల్ సైన్యం పొత్తుల లెక్కలతో కుస్తీ పడుతోంది. ఇక ఇదే సందని సందట్లో సడేమియాలా కాంగ్రెస్ కూడా పావులు కదుపుతోంది. వైసీపీ, టీడీపీల్లో టికెట్లు రానివాళ్లను పట్టుకునేందుకు వల వేసి కూర్చుంది హస్తం పార్టీ. చాలామంది టచ్‌లో ఉన్నారంటున్న గిడుగు.. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పొత్తుల పిడుగుతో అడుగు ముందుకు వేస్తుందంటున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత.. నీరసంగా, నిస్తేజంగా ఉన్న ఏపీ కాంగ్రెస్‌లో ఈమధ్యే కదలిక వస్తోంది. ఓట్ల శాతంలో నోటాతో పోటీ పడ్డ ఏపీ కాంగ్రెస్ ఇప్పుడు.. వైనాట్ ఏపీ అంటోంది. పార్టీలోకి షర్మిల రాకతో కాక పెరుగుతుందని భావిస్తోంది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన మోహరించి ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవుతున్న వేళ, అసంతృప్తుల కోసం ఆశగా ఎదురు చూస్తోంది కాంగ్రెస్. వైసీపీ, టీడీపీ నుంచి టికెట్లు రాక అసంతృప్తులు పెద్దఎత్తున బయటకు వస్తారని, వాళ్లకు తామే చాయిస్ అని కొత్త లెక్కలు చెబుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. కొత్త వ్యూహంలో భాగంగా వైసీపీ, టీడీపీ అసంతృప్తులపై ఫోకస్ పెంచింది హస్తం పార్టీ. చాలామంది తాజా, మాజీ నేతలు టచ్‌లో ఉన్నారంటున్న గిడుగు.. పండుగ తర్వాత పెను మార్పులు చూస్తారని ధీమాగా చెబుతున్నారు. ఈ నెల 17న అభ్యర్థుల కసరత్తు ప్రారంభిస్తామంటున్నారు ఆయన.
ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్తులతో పాటు పొత్తుల కోసం కూడా పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ. తమతో కలిసి వచ్చే చిన్నాచితకా పార్టీలను కలుపుకుని పోతామంటున్నారు గిడుగు. సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీలతో చర్చలు జరుపుతున్నామన్నారు ఆయన. అటు అసంతృప్తులు, ఇటు పొత్తులను నమ్ముకుని, రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ పెంచుకోవడానికి కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




