Huzurabad Badvel By Election: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగగా ఇటు హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్, అటు బద్వేల్‌లో వైసీపీ ఆధిక్యంలో నిలిచాయి. హుజురాబాద్ విషయానికొస్తే.. మొత్తం 723 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగింది. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలైంది. ఇందులో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు 503 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థికి 159 ఓట్లు.. కాంగ్రెస్‌కు 32 ఓట్లు వచ్చాయి. అయితే ఇందులోనూ 14 చెల్లని ఓట్లు పడటం అందరని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇటు తెలంగాణ.. అటు ఏపీలోనూ బెట్టింగ్ రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ జోరు పెంచారు. అయితే పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్‌కు ఆధిక్యం రావడంతో బెట్టింగ్ రాయుళ్లలో ఉత్కంఠ మొదలైంది. ఉప ఎన్నిక ఫలితాలపై కొన్ని ముఠాలు కోట్లాది రూపాయల మేర బెట్టింగ్‌లు కాస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక బద్వేల్ ఎన్నికల కౌంటింగ్ విషయానికొస్తే.. మొదట పోస్టల్ బ్యాలెట్స్‌తో ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు అధికారులు. మొత్తం 235 ఓట్లు పోలయ్యాయి. వీటిలో వైసీపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈవీఎమ్‌ల ఓట్ల లెక్కింపులో కూడా తొలి రౌండ్‌లో వైసీపీనే ఆధిక్యంలో నిలవడం విశేషం. మరి ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో రావాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్.. వీడియో
Sajjanar: గుట్కా నములుతూ బస్సు నడిపితే కఠిన చర్యలు.. ఆర్టీసీ డ్రైవర్లకు సజ్జనార్ హెచ్చరిక..
Kakatiya University: కాకతీయలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. లాఠీ ఝుళిపించిన పోలీసులు