Andhra: మాట్లాడదామని రూమ్‌కు పిలిచాడు.. ఫ్రెండే కదా అని ఆమె వెళ్లగా..
మాట్లాడాలని రూమ్‌కు పిలిచాడు. ఫ్రెండే కదా అని వెళ్ళింది. అంతే.! జరగాల్సింది జరిగిపోయింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మరి ఆ వివరాలు ఏంటో.? ఆ తర్వాత జరిగింది ఇది. ఈ స్టోరీలో ఓ సారి లుక్కేయండి మరి.

నెల్లూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఓ బీఫార్మసీ విద్యార్ధిని దారుణ హత్యకు గురైంది. ఇటీవలే బీఫార్మసీ పూర్తి చేసుకున్న మైధిలి ప్రియ అనే యువతిని మాట్లాడాలని చెప్పి.. ఆమె స్నేహితుడు రూమ్‌కు పిలిచి కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైధిలి ప్రియ ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు ఆమెను హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసుల ఎంక్వైరీలో.. ప్రియనే స్వయంగా కత్తితో పొడుచుకుని చనిపోయిందని నిఖిల్ చెబుతున్నాడట.
ఇక ప్రస్తుతం మైధిలి ప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు పోలీసులు. మైథిలిప్రియ మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.




