ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష (ప్రకటన నెం. 28/2022) తేదీలు శుక్రవారం విడుదలయ్యాయి. తాజా ప్రకటన ప్రకారం జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నయి. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనుండగా.. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి గ్రూప్ 1 పరీక్ష రాసే 25మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. వారిని దృష్టిలో పెట్టుకొని అధికారులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు.
కొత్త తేదీల ప్రకారం మెయిన్స్ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పది జిల్లాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లు మే 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. గ్రూప్ 1 అభ్యర్థులు ఈ సూచనలను అనుసరించాలని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.