Police Complaints Authority : తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సభ్యుల నియామకం..

Police Complaints Authority : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోలీసు ఫిర్యాదుల అథారిటీకి పలువురు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు

Police Complaints Authority : తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సభ్యుల నియామకం..
Police Complaints Authority

Updated on: Jul 09, 2021 | 5:49 AM

Police Complaints Authority : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోలీసు ఫిర్యాదుల అథారిటీకి పలువురు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. అదనపు ఎస్పీ, అంతకంటే పై స్థాయి పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదుల్ని ఈ అథారిటీ విచారిస్తుంది. తీవ్రమైన దుష్ప్రవర్తన, పోలీసు కస్టడీలో మృతి, దాడి, అత్యాచారం వంటి ఘటనలు జరిగిన సందర్భంలో వాటికి సంబంధించిన ఫిర్యాదుల విచారణకు దీనిని ఏర్పాటు చేశారు.

ఏపీ ప్రభుత్వం పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ముగ్గురు సభ్యులను నియమించింది. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేవీవీ గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.కిశోర్‌, ఉదయలక్ష్మి సభ్యులుగా నియామకమయ్యారు. 3 ఏళ్లు లేదా 65 ఏళ్లు వయసు వచ్చేవరకు కాలపరిమితి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వం పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్‌గా మద్రాస్‌ హైకోర్ట్‌ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇక జిల్లా స్థాయిలో ఛైర్మన్‌లు, సభ్యులను నియమించింది.

3 జిల్లాలకు ఒక ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఛైర్మన్‌గా వరప్రసాదరావు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు ఛైర్మన్‌గా విశ్రాంత జిల్లా జడ్జి ఆర్‌జే విశ్వనాథం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఛైర్మన్‌గా నేతల రమేశ్‌బాబు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతరం జిల్లాలకు ఛైర్మన్‌గా వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. జిల్లాల కమిటీ సభ్యులుగా విశ్రాంత విశ్రాంత కలెక్టర్‌లు, డీఎస్పీలను నియమించింది.

తెలంగాణ ప్రభుత్వం కూడా పోలీసు ఫిర్యాదుల అథారిటీ సభ్యులను నియమించింది. రిటైర్డ్‌ జస్టిస్‌ విలాస్‌ వీ అఫ్జల్‌పూర్కర్‌ను అథారిటీ చైర్మన్‌గా నియమిస్తూ హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులుగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ నవీన్‌చంద్‌, సభ్య కార్యదర్శిగా శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ వ్యవహరిస్తారని జీవోలో పేర్కొన్నారు. అదేవిధంగా రెండు జిల్లా పోలీస్‌ ఫిర్యాదుల అథారిటీలను కూడా ఏర్పాటు చేశారు.

వీటిలో హైదరాబాద్‌ రీజియన్‌ అథారిటీకి చైర్మన్‌గా రిటైర్డ్‌ జిల్లా జడ్జి కే సంగారెడ్డిని నియమించారు. సభ్యుడిగా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏ వెంకటేశ్వర్‌రావు, సభ్య కార్యదర్శిగా వెస్ట్‌జోన్‌ ఐజీని నియమించారు. వరంగల్‌ రీజియన్‌ జిల్లా పోలీస్‌ ఫిర్యాదుల అథారిటీ చైర్మన్‌గా రిటైర్డ్‌ జిల్లా జడ్జి ఎం వెంకటరమణరావు, సభ్యుడిగా రిటైర్డ్‌ అడిషనల్‌ కమిషనర్‌ జే లక్ష్మీనారాయణ, సభ్యకార్యదర్శిగా నార్త్‌జోన్‌ ఐజీని నియమించారు.

VIRAL VIDEO : చాక్లెట్‌తో ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ తయారీ..! ఎలా చేశాడో వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్.. పాతాళలోకానికి వెళ్లిన ఫీలింగ్.. వీడియో చూస్తే అద్భుతం..

China : కుటుంబ నియంత్రణ పాటించని వ్యక్తికి రూ.3 కోట్ల ఫైన్.. చివరకు రూ.10 లక్షలకు తగ్గింపు..