Apco Fashion Show: చేనేతకు చేయూత.. సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్..

|

Jan 02, 2022 | 5:22 PM

Apco Fashion Show: చేనేతలను ఆదుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తయారవుతున్న చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్..

Apco Fashion Show: చేనేతకు చేయూత.. సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్..
Follow us on

Apco Fashion Show: చేనేతలను ఆదుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తయారవుతున్న చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించేందుకు సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది సర్కార్. ఇందులో భాగంగానే ఆప్కో ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన రకరకాల వినూత్న చేనేత వస్త్రాలతో విజయవాడ ఆప్కో షోరూమ్ లో ఫ్యాషన్ షో నిర్వహించింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రాలు సరికొత్త డిజైన్లతో యువతీయువకులు చేసిన వస్త్ర ప్రదర్శన అందర్నీ ఆకట్టుకున్నాయి. చేనేత వస్త్రాలను నేటి యువతకు చేరువ చేసేందుకు ముద్దుగుమ్మలతో ఫ్యాషన్ షో నిర్వహించింది ఆప్కో. ఈ ఫ్యాషన్ షో కి ముఖ్య అతిథులుగా ఆప్కో చైర్మన్ మోహన్ రావు, ఎండి నాగమణి హాజరయ్యారు. నాణ్యమైన సాంప్రదాయ చేనేత వస్త్రాలను ప్రజల అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా షోరూమ్‌ లను ఏర్పాటు చేసామన్నారు చైర్మన్ మోహన్ రావు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఆప్కో వస్త్రాలు అందుబాటులో ఉండటంతో చేనేత వస్త్రాలను ప్రజలు ఇష్టపడి కొనడంతో ఆప్కో అమ్మకాలు పెరిగాయని తెలిపారు.

Also read:

Pakistan Terror Attacks: పాకిస్తాన్‌పై ఉగ్రదాడులతో విరుచుకుపడుతున్న తాలిబన్లు.. షాకింగ్ రిపోర్ట్..

Air Travel: విమాన ప్రయాణం ఖరీదు.. జెట్‌ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి.. లీటర్‌కి ఎంత పెరిగిందంటే..?

CISF నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలు, జీతభత్యాలు ఎలా ఉన్నాయంటే..?