AP ZPTC, MPTC Elections Counting: ఫుల్ స్వింగ్‌లో వైసీపీ.. అక్కడ క్లీన్ స్వీప్.. నారావారిపల్లిలో సైతం టీడీపీ ఓటమి

పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఫ్యాన్ గాలి వీస్తుంది. వార్ వనసైడ్ అయిపోయింది. కుప్పం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.  2 స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకుంది.

AP ZPTC, MPTC Elections Counting: ఫుల్ స్వింగ్‌లో వైసీపీ.. అక్కడ క్లీన్ స్వీప్.. నారావారిపల్లిలో సైతం టీడీపీ ఓటమి
Cm Jagan
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2021 | 2:36 PM

పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఫ్యాన్‌ గాలి ధాటికి ప్రత్యర్థి పార్టీలు కనీసం నిలవలేకపోయాయి. జెడ్పీటీసీ ఫలితాల్లో ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ మినహా మిగిలిన ఏ పార్టీ కూడా ఖాతా తెరవలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మొత్తం 641 జెడ్పీటీసీ సీట్లలో 95 శాతానికిపైగా అధికార పార్టీకే వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాల్లో జడ్పీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కౌంటింగ్‌ పూర్తయిన ప్రతిచోటా వైసీపీ అభ్యర్థులే గెలిచారు. అది కూడా వేల మెజార్టీతోనే విజయం సాధించారు.  ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఫ్యాన్‌ గాలి ఉధృతంగా ఉంది. టీడీపీ అధికారికంగా పోటీ చేయకపోయినా అక్కడక్కడా ఆ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు. మొత్తం 9859 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ 3 వేల మార్క్‌ క్రాస్ చేసింది. టీడీపీ స్కోర్‌ 200లోపే ఉంది.

గుంటూరు జిల్లా మాచర్ల నియెజకవర్గంలో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐదు జడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్‌సీపీ గెలుచుకుంంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో కౌంటింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ బ్యాక్సులో పేపర్లు తడిచిపోవడంతో బేజాత్‌పురం ఎంపీటీసీ, రావెల ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్‌పై సందిగ్ధత ఏర్పడింది. కుప్పం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.  2 స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకుంది. నారావారిపల్లి ఎంపీటీసీ స్థానాన్ని సైతం టీడీపీ కోల్పోయింది. అక్కడ వెయ్యి ఓట్ల మెజారిటీతో వైసీపి అభ్యర్థి రాజయ్య విజయం సాధించారు.

కౌంటింగ్ కి సంబంధించి.. కమిషనరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి 13 మంది అధికారులు ఈ డ్యూటీలో ఉన్నారు. సాయంత్రానికి పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాగా కోవిడ్ నేపథ్యంలో ఫలితాల తర్వాత సంబరాలు, విజయోత్సవ ర్యాలీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు.

Also Read: మధ్యాహ్నం 2 గంటలకు గంగమ్మ ఒడికి చేరనున్న ఖైరాతాబాద్ గణేశుడు