AP Rain Alert: మరో 12 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక

| Edited By: Srilakshmi C

Dec 03, 2023 | 8:02 AM

ఐఎండీ అంచనాల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఇవాళ తుఫానుగా బలపడనుందని అంచనా. ఇది రేపటికి తెల్లవారుజామునకు దక్షిణకోస్తా - ఉత్తర తమిళనాడు తీరాలకు చెరుకుంటుందని ఆతర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తూ మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉoదని తెలిపారు. రేపు దక్షిణకోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం..

AP Rain Alert: మరో 12 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక
AP Weather Report
Follow us on

విశాఖపట్నం, డిసెంబర్ 3: ఐఎండీ అంచనాల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఇవాళ తుఫానుగా బలపడనుందని అంచనా. ఇది రేపటికి తెల్లవారుజామునకు దక్షిణకోస్తా – ఉత్తర తమిళనాడు తీరాలకు చెరుకుంటుందని ఆతర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తూ మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉoదని తెలిపారు. రేపు దక్షిణకోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సోమ,మంగళవారాల్లో అక్కడక్కడ భారీ నుంచి తీవ్రభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాయసీమలో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలకు పడతాయన్నారు. బుధవారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల సంస్థవెల్లడించింది. ఇవాళ తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ, రేపు సాయంత్రం నుంచి గంటకు 80-100 కీమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు, మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదన్నారు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాగల 4 రోజుల వాతావరణ సమాచారం ఇలా..

ఆదివారం (03-12-2023) వాతావరణ నివేదిక

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సోమవారం (04-12-2023) వాతావరణ నివేదిక

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మంగళవారం(05-12-2023) వాతావరణ నివేదిక

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం(06-12-2023) వాతావరణ నివేదిక

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.