Rain Alert: చల్లని కబురు.. వచ్చే నాలుగు రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. పగలు ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. అక్కడకక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నాలుగు రోజులు ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. పగలు ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. అక్కడకక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్రలో మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. చెదురుమదురుగా భారీవర్షాలు నమోదు కావొచ్చని పేర్కొన్నారు.
అలాగే మరోవైపు కొన్నిచోట్ల ఎండ తీవ్రత ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గురువారం, శుక్రవారం ఉష్ణోగ్రతలు 40-42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాబోయే నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.
మే 1, గురువారం:
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 2, శుక్రవారం:
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 3, శనివారం:
రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 4, ఆదివారం:
రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి అనకాపల్లి జిల్లా దార్లపూడిలో 66మిమీ, ఎస్.రాయవరంలో 59మిమీ, అచ్యుతాపురంలో 55మిమీ, సాలపువానిపాలెం 51మిమీ, కొప్పాక 47మిమీ, ప్రకాశం జిల్లా అనుమలవీడు 44మిమీ చొప్పున, 24 ప్రాంతాల్ల్ 30మిమీ కు పైగా వర్షపాతం నమోదైందన్నారు.
బుధవారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో 42.7°C, వైఎస్సార్ జిల్లా అట్లూరు మరియు కర్నూలులో 41.8°C, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా తవణంపల్లె 41.7°C, అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 41.5°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
