Anantapur: కారులో వచ్చిన సీఐ సార్.. కులాసాగా కిరాణా సరుకులు కట్టమన్నాడు.. సీన్ కట్ చేస్తే
ఓ కిరాణా దుకాణం దగ్గరకు బ్లూ కలర్ అల్ట్రోజ్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక మనిషి బయటకు దిగాడు. కారులో సీఐ సార్ ఉన్నాడు.. ఈ సరుకులు కట్టమంటున్నాడు అని దుకాణం యజమానికి చెప్పాడు. సీఐ సారా.! హా.. కట్టేస్తా అంటూ దుకాణం యజమాని ఫాస్ట్‌గా సరుకులు కట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!
అనంతపురంలో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఓల్డ్‌టౌన్‌లోని ఓ కిరణా షాప్‌లో సుమారు రూ. 3 వేలు విలువ చేసే సరుకులు తీసుకుని ఉడాయించారు దుండగులు. కారులో టూటౌన్ సీఐ ఉన్నారని.. ఆయన చెప్పిన సరుకులు కట్టాలని షాప్ యజమాని చెప్పాడొక వ్యక్తి. సీఐ సార్ షాప్‌కొచ్చాడంటే యజమానులకు కచ్చితంగా కొంత భయం ఉంటుంది. దీంతో సదరు వ్యక్తి చెప్పినట్టుగానే సరుకులు కట్టి ఇచ్చాడు షాప్ యజమాని. ఆ సరుకులు తీసుకుని ఠక్కున ఉడాయించారు దుండగులు. అయితే ఆ తర్వాత ఆ కారులో పోలీసులెవరూ లేరని తెలియడంతో.. తాను మోసపోయానని గ్రహించిన దుకాణం యజమాని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు, కారును గుర్తించారు. ముగ్గురు దుండగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే కారులో అసలు పోలీసులు ఎవరు లేరని తేల్చి చెప్పారు.
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

