AP SEC Nimmagadda: నిమ్మగడ్డ మరో సంచలనం.. గవర్నర్‌తో చర్చిస్తున్న విషయాలు లీకవుతున్నాయంటూ హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది.   తాను గవర్నర్ తో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీకవుతున్న విషయంపై

AP SEC Nimmagadda: నిమ్మగడ్డ మరో సంచలనం.. గవర్నర్‌తో చర్చిస్తున్న విషయాలు లీకవుతున్నాయంటూ హైకోర్టులో పిటిషన్
Sec Nimmagadda
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 20, 2021 | 12:43 PM

Nimmagadda Ramesh Kumar: ఆంధ్రప్రదేశ్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది.   తాను గవర్నర్ తో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీకవుతున్న విషయంపై విచారణ జరపాలని హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. దీనిపై  సీబీఐతో విచారణ జరపాలని కోరారు.  తాను గవర్నర్ కు రాస్తున్న లెటర్స్ అన్ని పబ్లిక్ కాదని, ప్రివిలేజ్ లెటర్స్ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.  అవి గవర్నర్ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో విచారణ జరపించాలని కోరారు. తాను సెలవు పెడుతున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయని, మంత్రులు తాను గవర్నర్ కు రాసిన లెటర్స్ సోషల్ మీడియాలో చూశామని అంటున్నారని… అది ఎలా సాధ్యమో విచారించాలన్నారు నిమ్మగడ్డ.  గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ఈ పిటిషన్‌లో నిమ్మగడ్డ ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే విచారణ అనూహ్యంగా వేరే బెంచ్‌కు బదిలీ అయ్యింది.

అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసుపై కూడా స్పందన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసుపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పందించారు. తాను కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నానని, విచారణకు హాజరు కాలేనని… ప్రివిలేజ్‌ కమిటీకి సమాచారం అందించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యాదుతో అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చారు. తనకు నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్‌ కమిటీలోకి రాదని, తనపై ఆరోపణలకు ఆధారాలు చూపించాలని కోరారు. అసెంబ్లీపై, సభ్యులపై తనకు పూర్తి గౌరవం ఉందని రమేష్‌కుమార్‌ తన సమాధానంలో పేర్కొన్నారు.

గత కొంతకాలంగా ఏపీలో రాష్ట్ర సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ మధ్య వివాదం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో మొదలైన పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాన్ని ఎదురించి మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది. చివరికి ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం నమోదుచేసుకుంది. అయినప్పటికీ, ఎస్ఈసీపై వెనకు తగ్గడం లేదు వైసీపీ ప్రభుత్వం.. ఆయనకు ప్రివిలేజ్ నోటీసులు పంపించి, కమిటీ ముందు హాజరు కావాలని కోరింది.

Also Read:  పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో చోరీ.. విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. భలే ప్లాన్ చేశారుగా..!

AP Crime News: చిన్న పిల్లలను అపహరించి లైంగిక దాడులు.. ఆపై హత్యలు.. ఈ గోపి మహాకిరాతకుడు

Telangana MLC Elections Live Updates: