AP RGUKT 3rd Phase Counseling: ఏపీ ట్రిపుల్‌ఐటీ మూడో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. రిజిస్ట్రేషన్‌కు రేపే ఆఖరు

|

Aug 15, 2023 | 3:31 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023-29 విద్యాసంవత్సారానికి ఆరేళ్ల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మూడో విడత (ఫేజ్-3) షెడ్యూల్ విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి విడతలో 38,355 మంది దరఖాస్తు చేశారు. మొదటి విడతలో..

AP RGUKT 3rd Phase Counseling: ఏపీ ట్రిపుల్‌ఐటీ మూడో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. రిజిస్ట్రేషన్‌కు రేపే ఆఖరు
Nuzvid RGUKT 2023
Follow us on

అమరావతి, ఆగస్టు 15: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023-29 విద్యాసంవత్సారానికి ఆరేళ్ల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మూడో విడత (ఫేజ్-3) షెడ్యూల్ విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి విడతలో 38,355 మంది దరఖాస్తు చేశారు. మొదటి విడతలో మిగిలిపోయిన 829 సీట్లరే ఆగస్టు 9, 10 తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రెండో విడత పూర్తయిన తర్వాత నాలుగు క్యాంపస్‌లలో 294 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆర్టీయూకేటీ వెల్లడించింది.

ఈ మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 23, 27 తేదీల్లో నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆర్టీయూకేటీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. అలాగే ఇప్పటి వరకు సీట్లు పొందిన వారు క్యాంపస్‌ల మార్పుకు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. మూడో విడత కౌన్సెలింగ్‌కు ఆగస్టు 16లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అలాగు క్యాంపస్‌ మార్పునకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

తెలంగాణలో కొత్తగా 2 జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలను మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీ చేశారు. మహబూబాబాద్‌ (మానుకోట), ఖమ్మం జిల్లా పాలేరులో వీటిని ఏర్పాటుచేస్తున్నట్లు తెల్పింది. ఈ రెండు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 5 కోర్సులకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచే ఈ కాలేజీల్లో తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. ఎంసెట్‌ స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌లో మహబూబాబాద్‌ (మానుకోట), ఖమ్మం జిల్లా పాలేరు కాలేజీల్లోని సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ రెండు కాలేజీలతో కలిపి జేఎన్టీయూ కాలేజీల సంఖ్య ఏడుకు చేరింది. వనపర్తి, సిరిసిల్ల, మానుకోట, పాలేరులో ఇప్పటికే కాలేజీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.