అమరావతి, ఆగస్టు 15: గుంటూరు జిల్లాలోని లోకేష్ స్వంత నియోజకవర్గమైన మంగళగిరి లో పాదయాత్ర ప్రారంభమైంది. నిన్న సాయంత్రం నిడమర్రు వద్ద క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు యువత నేతలు క్యాంపు కార్యాలయం వద్ద వినూత్న రీతిలో జాతీయ జెండా ఎగుర వేశారు.