- Telugu News Photo Gallery PM Narendra Modi Speech Flag Hoisting at Red Fort Independence Day 2023 telugu News
Independence Day 2023: ఎర్రకోటపై వరుసగా పదోసారి జెండా ఎగరవేసిన ప్రధాని మోదీ
భారతదేశం యువత దేశం. దేశ యువతపై నాకు నమ్మకం ఉంది. దేశం పురోగమిస్తోంది. రానున్న కాలంలో మరింత ముందుకు వెళ్తామని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంతో ఇతర దేవాలతో పోలిస్తే ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. మేరే ప్యారే 140 కోట్ల పరివర్జన్.. అంటూ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మణిపూర్ అంశంపై కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్వరలో శాంతి నెలకొంటుంది అంటూ తెలిపారు
Updated on: Aug 15, 2023 | 1:13 PM

భారతదేశం ఈరోజు 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. వివిధ చోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఘనంగా ఈ వేడులకను నిర్వహించుకుంటున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగం చేశారు.

గత పదేళ్లుగా నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నేటికీ తన ప్రసంగం ద్వారా భారతదేశ భవిష్యత్తును అన్వేషించారు. దేశ ప్రగతిపై తన ప్రసంగం ద్వారా తెలియజేశారు మోదీ.

మేరే ప్యారే 140 కోట్ల పరివర్జన్.. అంటూ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మణిపూర్ అంశంపై కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్వరలో శాంతి నెలకొంటుంది అంటూ తెలిపారు.

భారతదేశం యువత దేశం. దేశ యువతపై నాకు నమ్మకం ఉంది. దేశం పురోగమిస్తోంది. రానున్న కాలంలో మరింత ముందుకు వెళ్తామని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంతో ఇతర దేవాలతో పోలిస్తే ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు.




