AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: QR కోడ్ స్కాన్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి.. ఏమాత్రం తేడా ఉన్నా చర్యలే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇకపై ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఆ QR కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చు..

Andhra: QR కోడ్ స్కాన్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి.. ఏమాత్రం తేడా ఉన్నా చర్యలే..
Ration Shop Complaints
P Kranthi Prasanna
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 26, 2025 | 1:02 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇకపై ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఆ QR కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చు.. అందుకోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్‌లో సరైన వివరాలు నమోదు చెయ్యాల్సి ఉంటుంది. దీని ద్వారా.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలి అనే దానిపై స్పష్టత రానుంది.

ఈ ఫారమ్‌లో పౌరులు ఇవ్వవలసిన ప్రశ్నలు/అభిప్రాయాలు ఇలా ఉంటాయి..

ఈ నెల రేషన్ తీసుకున్నారా?

సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా?

సరైన తూకంతో సరఫరా చేశారా?

డీలర్ మర్యాదగా వ్యవహరించారా?

ఏమైనా అధిక ధరలు వసూలు చేశారా?

ఇలాంటి ప్రశ్నలకు “అవును/కాదు” అని సమాధానాలు ఇచ్చే విధంగా ఉంటుంది. పౌరుల నుంచి వచ్చిన స్పందనలు నేరుగా ఉన్నతాధికారులకు చేరి, అవసరమైనచోట్ల చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ప్రజల భాగస్వామ్యం ద్వారా సేవల్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానం అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరిగ్గా అందుతున్నాయా లేదా లోటుపాట్లు ప్రజల అభిప్రాయాలతో పాటు అక్రమాలకు తావు లేకుండా పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇదే కాకుండా నేటి నుంచి 65 సంవత్సరముల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం 5 రోజుల ముందే ఇంటికే రేషన్ సరఫరా చేసే విధానం ప్రారంభమైంది. జులై రేషన్‌ను జూన్ 26వ తేదీ నుంచే పంపిణీ చేస్తున్నారు.. ప్రజల అభిప్రాయాలే మార్గదర్శకంగా మారే ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి అంటూ పౌర సరఫరాల శాఖ పిలుపునిచ్చింది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..