Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీకి మరో గండం.. ఈ జిల్లాలకు..

ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎండలు భగభగ మండుతుంటే.. మరి కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.

AP Rains: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీకి మరో గండం.. ఈ జిల్లాలకు..
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 07, 2025 | 7:39 PM

ఐఎండి సూచనల ప్రకారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు(07-04-25) ఉదయం 08.30 గంటలకు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది రేపటి(ఏప్రిల్ 8) వరకు వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో గురు,శుక్రవారాల్లో (10, 11 తేదీల్లో) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు, ఎల్లుండి(ఏప్రిల్ 8, 9) అకస్మాత్తుగా పిడుగులతో కూడిన అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం నంద్యాలలో 41.5°C, కర్నూలు(D) నడిచాగిలో 41.1°C, వైఎస్సార్(D) బలపనూరులో 41°C, ప్రకాశం(D) నందనమారెళ్ళలో 40.8°C, తిరుపతి(D) గూడూరు, విజయనగరం(D) నెలివాడలో 40.6°C, చిత్తూరు(D) నగరిలో 40.5°C, అన్నమయ్య(D) కంభంవారిపల్లె 40.4°C, పల్నాడు(D) రావిపాడులో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. వైఎస్సార్ జిల్లాలో 14, నంద్యాల జిల్లాలో 10చోట్ల, ఇతర జిల్లాల్లో 15, మొత్తంగా కలిపి 39 చోట్ల 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.

ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి

ఏపీ విద్యార్ధులకు పేద్ద పండుగే.. మధ్యాహ్న భోజనంలో ఎగ్ ఫ్రైడ్ రైస్
ఏపీ విద్యార్ధులకు పేద్ద పండుగే.. మధ్యాహ్న భోజనంలో ఎగ్ ఫ్రైడ్ రైస్
ఈ హాట్ బ్యూటీ ఆ సీరియల్లో పవర్ ఫుల్ విలనా.. ?
ఈ హాట్ బ్యూటీ ఆ సీరియల్లో పవర్ ఫుల్ విలనా.. ?
ఒక్క రోజే వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన గూగుల్‌!
ఒక్క రోజే వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన గూగుల్‌!
ప్రియుడు కోసం 1200 కి.మీ ప్రయాణం.. చివరికి ఊహించని ట్విస్ట్..!
ప్రియుడు కోసం 1200 కి.మీ ప్రయాణం.. చివరికి ఊహించని ట్విస్ట్..!
భారతదేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రాలేవో తెలుసా..?
భారతదేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రాలేవో తెలుసా..?
ఐపీఎల్‌కు దూరమైన తర్వాత తొలిసారి స్పందించిన రుతురాజ్!
ఐపీఎల్‌కు దూరమైన తర్వాత తొలిసారి స్పందించిన రుతురాజ్!
ఈ తెలుగు సినిమాల నిడివి 3 గంటల పైనే.. బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్.
ఈ తెలుగు సినిమాల నిడివి 3 గంటల పైనే.. బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్.
తలా రాకతో చెన్నై తలరాత మారేనా?.. అసలు జట్టులో మారాల్సిందేంటి?
తలా రాకతో చెన్నై తలరాత మారేనా?.. అసలు జట్టులో మారాల్సిందేంటి?
అక్షయ తృతీయకు ముందు భగ్గుమంటున్న బంగారం ధర..తులంపై ఎంత పెరిగిదంటే
అక్షయ తృతీయకు ముందు భగ్గుమంటున్న బంగారం ధర..తులంపై ఎంత పెరిగిదంటే
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‏లతో సినిమాలు చేసింది..
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‏లతో సినిమాలు చేసింది..