AP Polycet 2023 Counselling: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 15 నుంచి తరగతులు

|

May 23, 2023 | 12:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్‌ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మే 25 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి సోమవారం (మే 22) ఓ ప్రకటనలో తెలిపారు..

AP Polycet 2023 Counselling: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌-2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్ 15 నుంచి తరగతులు
AP Polycet 2023 Counselling
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్‌ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మే 25 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి సోమవారం (మే 22) ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు మే25 నుంచి జూన్‌ 1 వరకు చెల్లించవచ్చన్నారు. ధ్రువపత్రాల పరిశీలన మే 29 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించనున్నారు. జూన్‌ ఒకటి నుంచి 6వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. జూన్‌ 7న ఐచ్ఛికాల మార్పుకు అవకాశం కల్పిస్తారు. జూన్‌ 9న సీట్ల కేటాయింపు చేస్తారు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత జూన్ 15 నుంచి అన్ని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.

కాగా ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఫలితాలు మే 20 (శనివారం) విడుదలయ్యాయి. ఈ పరీక్షకు మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 1,43,625 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,24,021 మంది అర్హత సాధించారు. వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.