AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..

తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. కానీ.. ఇప్పుడు తల్లి ఫిర్యాదుతో పది గంటల్లోనే ఆచూకీ లభ్యమైంది. ఇంతకీ.. చిన్నారి మిస్సింగ్‌ వెనకున్న మిస్టరీ ఏంటి?... పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకోండి..

Andhra Pradesh: ఐదేళ్ల క్రితం చిన్నారి మిస్సింగ్‌.. పది గంటల్లోనే ఆచూకీ లభ్యం.. అసలేం జరిగిందంటే..
Missing Mystery
Shaik Madar Saheb
|

Updated on: Aug 10, 2024 | 10:19 AM

Share

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో చిన్నారి మిస్సింగ్‌ మిస్టరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోనగూడెం గ్రామానికి చెందిన కొర్రపు ఆదిలక్ష్మీకి ఐదేళ్ల క్రితం పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి పొత్తిళ్లలోని చిన్నారి వారం తర్వాత మాయం కావడంతో షాక్‌ అయింది. బిడ్డ అదృశ్యంపై ఆ తల్లి ఐదేళ్లుగా తల్లడిల్లిపోతూ ఎంతమందికి మొరపెట్టుకున్నా ఆచూకీ మాత్రం కొనుక్కోలేకపోయారు. కానీ.. ఇటీవల చిన్నారుల మిస్సింగ్‌పై కూటమి సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడంతో ఆ తల్లిలో ఆశలు చిగురించాయి. ఎలాగైనా తన బిడ్డ ఆచూకీ తెలుసుకోవాలని తాపత్రాయ పడింది. ఈ క్రమంలోనే.. ఇటీవల గ్రీవెన్స్‌ డేలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది కొర్రపు ఆదిలక్ష్మీ.

ఐదేళ్ల క్రితం ఆస్పత్రిలో.. కన్న వారం రోజులకే తన బిడ్డను మాయం చేశారంటూ జిల్లా కలెక్టర్, అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా బిడ్డ కోసం పడుతోన్న బాధను.. తపనను అధికారుల ముందు వెల్లడించింది. తన బిడ్డను వెతికి అప్పగించాల్సిందిగా కలెక్టర్‌కు మొరపెట్టుకోవడంతో అధికార యంత్రాంగాన్ని అలెర్ట్‌ చేశారు. దాంతో.. బాలిక ఆచూకీ 24గంటల్లో కనుక్కోవాలని అధికారులను ఆదేశించడంతో అన్వేషణ మొదలుపెట్టారు.

తూర్పుగోనగూడెంలో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసిన అధికారులు.. 10 గంటల్లోనే చిన్నారి ఆచూకీని కనిపెట్టడంతో ఐదేళ్ల మిస్సింగ్‌ మిస్టరీ వీడింది. టెక్నాలజీ ఆధారంగా రాజమండ్రి పరిధిలోని లాలాచెరువు దగ్గర చిన్నారి ఆచూకీని గుర్తించారు పోలీసులు. లాలాచెరువు దగ్గర కొందరి నుంచి చిన్నారిని తీసుకుని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధిరులకు అప్పగించారు. చిన్నారి దొరికినట్లు తల్లికి తెలియజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించి తల్లి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. కాగా..ఐదెళ్ల క్రితం మిస్సైన బాలిక ఆచూకీని కనుగొనడంపై కుటుంబసభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..